ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి చంద్రబాబు గత కొద్దికాలంగా కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.చాలావరకు పార్టీకి సంబంధించిన బాధ్యతలను యువకులకు ఇచ్చే రీతిలో వ్యవహరిస్తున్నారు.
ఇటీవలే ఎన్టీఆర్ భవన్ లో రెండు తెలుగు రాష్ట్రాల నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎక్కువ టికెట్లను యువకులకు ఇచ్చే రీతిలో ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో సీనియర్లను యువకులు గౌరవించాలని బాబు గతంలో తెలియజేయడం తెలిసిందే.
ఇదిలా ఉంటే మహానాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చంద్రబాబు సరికొత్త స్కెచ్ వేసినట్లు సమాచారం.
పూర్తి విషయంలోకి వెళ్తే మహానాడు కార్యక్రమం తర్వాత ప్రతి నెల రెండు జిల్లాల్లో పర్యటించాలని .పార్టీ తరఫున కీలక కార్యక్రమాలు నిర్వహించి స్థానిక క్యాడర్ తో ప్రత్యేకంగా మాట్లాడే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.ఇలా ఉంటే రేపు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ నాయకులు భారీ ఎత్తున జన్మదిన వేడుకలకి ఏర్పాట్లు చేస్తున్నారు.