ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వైసీపీకి ఇదే చివరి ప్రభుత్వ పరిపాలన అని స్పష్టం చేశారు.కర్నూలు జిల్లాలో గత కొంతకాలంగా శాంతిభద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆత్మకూరులో పోలీసులు ఆస్తులు తగలబెట్టడం.హత్యాయత్నం చేయడం.
పోలీసులు జైలుకు పంపడం ఈ రాష్ట్ర ప్రజలు చూశారని మండిపడ్డ్డారు.
ఇక ఇదే సమయంలో నంద్యాలలో మత దురహంకార సంస్థలు ఏకంగా రోడ్డు మీదకు వచ్చి, ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని సంచలన ప్రకటనలు చేశాయి.
మా కనుసన్నల్లోనే వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తుందని ప్రకటించుకున్నాయి.ఇటువంటి వాళ్ళ మీద ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా పెట్టలేదు.ఇక ఇదే సమయంలో ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా… కర్నూలులో కొన్ని దాడులు జరిగాయి.పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారని విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు.







