అమరావతి ఉద్యమం 500 రోజులకు చేరటంతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి నే ఏకైక రాజధానిగా ఉంచాలని గత కొంత కాలం నుండి అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తెరపైకి తీసుకు వచ్చిందో అప్పటినుండి .

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు దీక్షలు చేపడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.అయితే ఈ ఉద్యమానికి రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ వచ్చాయి.

ముఖ్యంగా టిడిపి పార్టీ మొదటి నుండి అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి బాసటగా నిలిచింది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఉద్యమం 500 రోజుకి చేరటంతో సోషల్ మీడియాలో బాబు పెట్టిన పోస్ట్ ఈ విధంగా ఉంది ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు.

తన పాలనలో తాను తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తోంటే, 500 రోజులలో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని మూర్ఖపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి అని బాబు సీరియస్ అయ్యారు.అంతే కాకుండా ఇంకా కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ అన్నారు.

Advertisement

రాష్ట్ర రాజధాని కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తోన్న మహిళలను బూటు కాళ్ల‌తో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు అని పేర్కొన్నారు.పాలకులు ఎంత  నిర్దయగా ప్రవర్తిస్తున్నా, ప్రజా రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు 500 రోజులుగా శాంతియుతంగా నిరాటంకంగా తమ ఆందోళనను కొనసాగిస్తోన్న రైతులు, రైతు కూలీలు, మహిళలకి అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నాను అని చంద్రబాబు స్పష్టం చేశారు.ఒక్క చంద్రబాబు మాత్రమే కాక చాలా మంది రాజకీయ నేతలు అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు.

 .

Advertisement

తాజా వార్తలు