మరికాసేపట్లో యశోద ఆస్పత్రికి చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు.ఈ క్రమంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన పరామర్శించనున్నారు.

తుంటి ఎముక మార్పిడి సర్జరీ జరగడంతో కేసీఆర్ యశోద ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.

కాగా ఇటీవల ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ప్రమాదవశాత్తు జారిపడటంతో కేసీఆర్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయనకు సర్జరీ చేసిన వైద్యులు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వెల్లడించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు