రాబోయే ఎన్నికల్లో ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలనే విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ఒక క్లారిటీ తెచ్చుకునే పనిలో పడినట్టుగా కనిపిస్తున్నారు.దీనిలో భాగంగానే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పై బాబు దృష్టిపెట్టారు.
ఇక్కడ టిడిపి ఎంపీగా కేసునేని నాని ఉన్నారు.అయితే ఆయన చాలాకాలంగా పార్టీలోనే ఉన్నా అసంతృప్తితో ఉంటున్నారు.
అలాగే నాని వ్యవహార శైలి కారణంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టిడిపి నాయకుల్లోనూ చేలిక వస్తోందని, బాబు బలంగా నమ్ముతున్నారు.దీనికి తగ్గట్లుగానే రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదు అని కేశినేని నాని ప్రకటించడంతో ఇప్పుడు అక్కడ ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో బాబు నిమగ్నమయ్యారు.
ముందుగా కేసినేని నాని సోదరుడు కేశినేని చిన్నిని ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించాలని బాబు చూసినా.నానితో మళ్లీ తలనొప్పులు తప్పవనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్త నేతలను ఎంపిక చేసే పనిలో పడ్డారట.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీకి గట్టిపట్టు ఉంది.అందుకే 2019 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గాలిని తట్టుకుని మరి విజయవాడ పార్లమెంట్ ను టిడిపి గెలుచుకోగలిగింది.2024 ఎన్నికల్లోను పార్టీ అభ్యర్థి ఎవరైనా తప్పకుండా గెలుస్తారని, ఈ మేరకు బలమైన కేడర్ ఉండడంతో పాటు వైసిపి పై జనాలు వ్యతిరేకత పెరుగుతోందని బాబు గుర్తించారు.

సినీ నిర్మాత చలసాని అశ్విని దత్ ను పోటీకి దించాలని బాబు డిసైడ్ అయ్యారట.దీనికి తగ్గట్లుగానే గత కొద్ది రోజులుగా వైసిపి ప్రభుత్వంపై అశ్విని దత్ విమర్శలు చేస్తున్నారు.2004 ఎన్నికల్లో అశ్విని దత్ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓటమి చెందారు.ఇక అప్పటి నుంచి పెద్దగా పార్టీని పట్టించుకోనట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నా, కేశినేని నాని స్థానంలో ఆర్థికంగా బలంగా ఉన్న అశ్విని దత్ ను పోటీకి దింపితే ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులకు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడవనే లెక్కల్లో బాబు ఉన్నారట.