తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో 2014లో గెలిచినట్లు ఈసారి గెలవాలని అప్పటి కూటమి రిపీట్ చేయడం జరిగింది.
దీంతో బీజేపీ.జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.
ఈ క్రమంలో బీజేపీ పార్టీకి( BJP ) 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు కేటాయించారు.జనసేన పార్టీకి( Janasena ) 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు కేటాయించడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ( TDP ) 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలలో పోటీ చేస్తూ ఉంది.ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో చంద్రబాబు ప్రచారం మొదలుపెట్టడం తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉండగా రెండు రోజుల క్రితం కుప్పంలో ప్రజాగళం( Praja Galam ) పేరిట ప్రచారం ప్రారంభించడం జరిగింది.కుప్పంలో మహిళలతో ఆ తర్వాత యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.కాగా బుధవారం మదనపల్లెలో( Madanapalli ) ప్రజాగళం సభ నిర్వహించడం జరిగింది.ఈ సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.బాబాయ్ ని గొడ్డలితో చంపిన వ్యక్తులతో జగన్( Jagan ) తిరుగుతున్నారు అని ఆరోపించారు.మంత్రి పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం అల్పాహారం.
మైన్స్ మధ్యాహ్నం భోజనం.అన్నమయ్య జిల్లాల్లో పాపాల పెద్దిరెడ్డి పాలన సాగుతోంది.
కాంట్రాక్టులన్నీ ఆయనే తీసుకొని.ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నారు.
రౌడీయిజం కావాలో.? ప్రజాస్వామ్యం కావాలో.? ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.