టీడీపీ, జనసేన పొత్తుపై ప్రభుత్వ (ప్రజా వ్యవహారాల) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్య కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని వారానికోసారి రాజకీయం చేసే ఆయన విమర్శలకు విలువ లేద’ ని సజ్జల అన్నారు.
అలాగే ఈ సమావేశంలో టీడీపీ, జనసేన పోత్తుపై కూడా మాట్లాడారు.“మాకు ఉన్న సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని 30 సీట్లు అభ్యర్థించారు.
కానీ టీడీపీ మాత్రం పదిహేను సీట్లు ఇస్తానని ప్రతిపాదించింది.ఒకవేళ గెలిస్తే ఎవరు సీఎం అవుతారు – చంద్రబాబు నాయుడా లేదా పవన్ కళ్యాణా? అనే విషయంపై కూడా ఆయన భిన్నంగా స్పందించారు.ఆయన విషయాన్ని పక్కన పేడితే టీడీపీ , జనసేనకు ఆపర్ చేసిన ఈ సీట్లు ఏంటీ అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఉత్తరాంధ్రలో 3, గోదవరి జిల్లాల్లో 5, కృష్ట, గుంటూరు జిల్లాల్లో ఒక్కొకటి చొప్పున, రాయలసీమలో 3, ప్రకాశం, నెల్లురూ జిల్లాలో ఒక్కొకటి సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అయితే అవి ఏ నియోజకవర్గాలనేది స్పష్టంగా తెలియలేదు.అభ్యర్థులు బలంగా ఉన్న చోటే జనసేన టికెట్స్ అడిగినట్లుగా తెలుస్తోంది.ఇక టీడీపీ, జనసేన పొత్తుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్లో ఏ మాత్రం ఆందోళన చెండం లేదు.ఈ పోత్తు తమకు కలిసోచ్చే వ్వవహారంగానే వైసీపీ భావిస్తుంది.

సీట్ల పంపకం లేదా అధికారం పంచుకోవడం రెండు పార్టీలకు తలనొప్పిగా మారవచ్చిన అభిప్రాయపడుతుంది.సజ్జల, అయితే కొందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ పోత్తు విషయంలో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.బహుశా ఈ కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకీకృతం చేయగలదని, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను అధికారం నుండి దూరం చేయగలదని వారు భయపడుతున్నారు.పలు నియోజకవర్గాల్లో వైసీపీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది.
జనసేన,టీడీపీ కలిసి పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల్లో ఓటమి తప్పందని పలువురు నేతలు భావిస్తున్నారు.