బాబు ఇప్పట్లో ఏపీకి రానట్టే ? ఆ బహిష్కరణ కు కారణం ఇదేనా ? 

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.ఏపీకి వచ్చేందుకు ఏ మాత్రం ఆయన ఇష్టపడడం లేదు .

దీనికి కారణం కరోనా భయమేనట.గతంతో పోలిస్తే కరోనా వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.

వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.తెలంగాణతో పోలిస్తే ఏపీలో కేసుల సంఖ్య బాగా ఎక్కువగా ఉన్నాయి.

ఈ సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పై విమర్శలు చేసేందుకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు.సరిగ్గా ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో, ఆ సమావేశాలను తాము బహిష్కరిస్తున్నామని  టిడిపి ప్రకటన విడుదల చేసింది.

Advertisement

ప్రస్తుతం కరోనా వైరస్ ఉదృతంగా నడుస్తున్న సమయంలో,  అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం అంత ఫేస్  కాదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న, తప్పనిసరిగా ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి వస్తే ఒక రోజుకే పరిమితం చేయాలని వైసిపి ప్రభుత్వం భావిస్తోంది.

అయితే దీనిని సాకుగా చూపించి బడ్జెట్ సమావేశం తాము బహిష్కరిస్తున్నట్లు టిడిపి చెబుతోంది. 2.11 లక్షల కోట్లతో ఉన్న బడ్జెట్ ను సాదాసీదాగా ఒక రోజులో చర్చించి ముగించడం ఏమిటని, ఆ బడ్జెట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో చర్చించాలని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు డిమాండ్ చేశారు.అయితే అసలు ఈ సమయంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేదట.

అందులోనూ ఈ కరోనా సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే తప్పనిసరిగా ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయంతో చంద్రబాబు ఈ ఎత్తుగడ వేసినట్లు గా అర్థం అవుతోంది.ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే ఎమ్మెల్యేలతో పాటు వారికి సంబంధించిన సిబ్బంది పెద్ద ఎత్తున హాజరవుతారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అది ఏ మాత్రం సేఫ్ కాదు అనే ఉద్దేశంతోనే ఈ బహిష్కరణ ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది.అసలు కరోనా ప్రభావం ముగిసే వరకూ ఏదో ఒక సాకు చూపించి హైదరాబాద్ లోనే ఉండేందుకు బాబు ప్రాధాన్యం ఇస్తారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు