ఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu ) అరెస్టుతో అంతా అతలాకుతలంగా మారిపోయింది.చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఆయనకు బెయిల్ దొరకడం లేదు.
ఇక ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యాక పార్టీ బాధ్యతలు అన్ని తీసుకొని పార్టీని కార్యకర్తలని ముందుండి నడిపిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ ( Nandamuri balakrishna ) .ఇక బాలకృష్ణ పార్టీ బాధ్యతలను తీసుకోవడంతో చాలామంది నందమూరి అభిమానులు మళ్లీ పార్టీ స్థాపించిన వారి చేతుల్లోకి వెళ్ళింది అని ఎంతగానో ఆనందపడ్డారు.కానీ వారి ఆనందాన్ని కొద్ది రోజులు కూడా ఉంచలేదు చంద్రబాబు నాయుడు.జైల్లో ఉంటూనే బాలకృష్ణ ని హైలెట్ కాకుండా చూశాడు.

ఎందుకంటే ఒకవేళ బాలకృష్ణ రాష్ట్రంలో హైలెట్ అయితే కచ్చితంగా తన తండ్రి పార్టీ కాబట్టి వారసత్వంగా బాలకృష్ణనే సీఎం అవ్వాలి అని ప్రజలు ఆయనకే జై కొట్టి మనసు మార్చుకునే ఉద్దేశం ఉంది.ఒకవేళ తను బయటికి వచ్చినా కూడా తనని ఎవరు ఆదరించరు అనే ఉద్దేశంతో కొత్తగా తెర మీదకి బాలకృష్ణను తెప్పించి పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) ని హైలెట్ చేయించారు.ఇక జైల్లో కూర్చునే ఎన్నో వ్యూహాలు పన్నుతున్నారు.మెల్లిమెల్లిగా బాలకృష్ణని సైడ్ చేస్తున్నారు.చంద్రబాబు అరెస్ట్ అయిన నాలుగైదు రోజులు ఎంతో హడావిడిగా మీడియాలో వైరల్ అయిన బాలకృష్ణ ప్రస్తుతం ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ప్రస్థావన తీసుకురావడం లేదు.ఇక ఇలా చంద్రబాబు నాయుడు పేరుని వైరల్ చేస్తూ తాను ఫేమస్ అవుతాడు అనే ఉద్దేశంతో చంద్రబాబు జైల్లో ఉండే బాలకృష్ణని సైడ్ చేయాలని చూస్తున్నారట.

బాలకృష్ణని ఇలాగే వదిలేస్తే ఎక్కడ పార్టీ పగ్గాలు ఆయన చేతిలోకి వెళ్తాయో అని భయపడి తెలంగాణ ( Telangana ) లో 87 స్థానాల్లో టీటీడీపీ పోటీ చేస్తుందని, ఇక దానికి సంబంధించిన బాధ్యతలు అన్నీ బాలకృష్ణనే చూసుకుంటారని జైల్లో నుండే తన అనుచరులతో బాలకృష్ణకి తెలంగాణ బాధ్యతలు అప్పగించి ఆంధ్రప్రదేశ్ నుండి సైడ్ చేయించారట.చంద్రబాబు అరెస్ట్ అవడంతోనే చంద్రబాబు పని అయిపోయింది అని,మళ్లీ మా నాయకుడి చేతుల్లోకి పార్టీ పగ్గాలు వస్తాయని నందమూరి అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు.కానీ వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు.ఇలా చంద్రబాబు జైల్లో ఉంటూనే బాలకృష్ణకు తెలియకుండా రాజకీయాలు చేస్తూ పొమ్మనలేక పొగ పెడుతున్నారు.