పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంతోపాటు క్రమశిక్షణ లాంటివి నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు( Teacher ) చేసిన ఒక నీచపు పాడు పని గురించి తెలిస్తే సభ్య సమాజమే తలదించుకోవలసి వస్తుంది.మైనర్ విద్యార్థినిని బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు.
అయితే ఆ మైనర్ విద్యార్థిని పండంటి బిడ్డకు జన్మను ఇవ్వడంతో ఉపాధ్యాయుడి నీచపు బుద్ధి వెలుగులోకి వచ్చిన ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో( Srisatyasai District ) చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
కదిరి డీఎస్పీ శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం.కదిరి నగరానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక, కదరిలో ఉండే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది.
దాదాపుగా 9 నెలల క్రితం ఆ బాలిక మంచినీళ్లు తాగేందుకు స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళింది.అప్పుడు స్టాఫ్ రూమ్ లో ఒంటరిగా ఉన్న రెడ్డి నాగయ్య( Reddy Nagaiah ) అనే ఉపాధ్యాయుడు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఆ తరువాత ఆ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ విషయం బయటకు వస్తే చంపేస్తానని బెదిరించడం వల్ల ఆ బాలిక ఎవరితో ఈ విషయం చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయింది.అయితే శనివారం ఆ బాలికకు కడుపు నొప్పి( Stomach Pain ) రావడంతో స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మగ బిడ్డకు జన్మనిచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది.బాలిక నీరసంగా ఉండడం, రక్తం తక్కువగా ఉండడం వల్ల వైద్యులు ముందు కదిరి ప్రాంతీయ వైద్యశాలకు, ఆ తరువాత అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

పోలీసులకు సమాచారం అందడంతో ఎస్సై రాజశేఖర్ తో పాటు కదిరి డీఎస్పీ శ్రీలత అనంతపురం ఆస్పత్రిలో ఉండే బాలికను పరామర్శించి నిందితుడైన ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.








