చంద్రబాబు నాయుడు.ఈ పేరు వింటే గుర్తొచ్చేది కూల్ గా సాగిపోయే రాజకీయం.
అమకంటే కూల్ గా సాగిపోయే బాబు వ్యూహాలు…మరీ అంతకంటే ధైర్యంగా సాగిపోయే బాబు దూకుడు.రాజకీయాల్లో తనది అందరికంటే ఒక ప్రత్యేకమైన ,విభిన్నమైన శైలి.
అయితే తాజా రాజకీయ పరిస్థితులని ఆయన ఎదుర్కోలేక పోతున్నారు, ప్రత్యర్ధుల ఎత్తులకి పై ఎత్తులు వేయలేక పోతున్నారు అనేది తాజా రాజకీయ పరిస్థితులు తెలుపుతున్నాయని అంటున్నారు రాజకీయ పండితులు.బాబు లో గతంలో ఉన్న దూకుడు ఇప్పుడు తగ్గిందనే వాదన తెరపైకి తీసుకువస్తూ తాజాగా జరిగిన ఓ సంఘటనని ఉదాహరణగా చెప్తున్నారు.

రెండు రోజుల క్రితం కేసీఆర్ చంద్రబాబు పై మాటల తూటాలు పేల్చిన సంగతి అందరికి తెలిసిందే అయితే.ఇన్నేళ్ళ కాలంలో బాబు ని ఇంతగా ఆదుకున్న సందర్భం లేనేలేదు.అయితే కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న బాబు అందుకు తగ్గట్టుగా తానూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చాడు అయితే…ఈ కౌంటర్ విషయంలో తానూ అడ్డంగా దొరికిపోతాను అని ఊహించని బాబు తనలో దాగిఉన్న భయాన్ని బయటపెట్టేశాడు అంటున్నారు విశ్లేషకులు.
కేసీఆర్ తనని వివిధ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని.
అలా చేస్తే తాను కూడా తిరిగి కేసులు పెడతానని హెచ్చరికలు జారీ చేశారు దాంతో బాబు కి కేసుల విషయంలో ఉన్న భయం బయట పడిందని అంటున్నారు.ఒక వేళ కేసీఆర్ ఒక్కకేసు పెడితే తాను నాలుగు కేసులు పెట్టడానికి సిద్దంగా ఉన్నానని చెప్పడం దేనికి నిదర్సనం అంటూ ప్రశ్నలు వినిన్పిస్తున్నాయి.
బంగారు గుడ్లుపెట్లే తెలంగాణను వదిలేసినప్పటికీ తనపై కేసీఆర్ అక్కసు వెల్లగక్కుతున్నారని మండిపడ్డారు.

ఎంతో అనుభవం ఉన్న నన్ను చెత్త పొలిటీషియన్ అనడం, కాంగ్రెస్ నాయకులును ఇడియట్స్ అని వ్యాఖ్యానించడం మంచి పద్దతి కాదని బాబు అన్నారు.గతంలో తాను ఎన్టీఆర్ నుంచి టీడీపీని తన చేతుల్లోకి తీసుకున్నప్పడు కేసీఆర్ కూడా తనతోనే ఉన్నారని, ఆ తరువాత ఆయన మంత్రి అయ్యారనే విషయం గుర్తు చేశారు…ఇవన్నీ పక్కన పెడితే.తానూ ఒక్క కేసు పెడితే నేను నాలుగు కేసులు పెడతానని అనడం చూస్తుంటే బాబు కి కేసీఆర్ మాటలు ఎంతటి భయాన్ని కలిగించాయో అర్థం అవుతోందని విశ్లేషకులు తమ అభిప్రాయాలని వ్యక్తపరిచారు.
ఈ భయాలతోనే బాబు కాంగ్రెస్ పంచన చేరారని రాజకీయ పండితులుచెబుతున్నారు.







