జగన్ ముంచుతారా ... తేల్చుతారా ? ఏం చేస్తారో ...?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఓ కొత్త భయం పట్టుకుంది.ఆ భయంతో కొత్త సంస్కారం వేడుకలను కూడా మనస్ఫూర్తిగా చేసుకోలేనంత భయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకుని ఉన్నాం .ఇప్పుడు చివరాఖరిలో జగన్ తమను ముంచుతాడా లేఖ తేల్చుతాడా అనే సందిగ్ధంలో ఉన్నారు.ఒక వైపు ఎన్నికలు ముంచుకొస్తుంటే.

మరో వైపు జగన్ పాదయాత్ర కూడా పూర్తి కావొచ్చింది.దీంతో ఇక ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపైనే మొత్తం దృష్టంతా పెట్టబోతున్నాడు.

దీంతో తమ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి.అనే విషయం మీద వీరికి కొత్త టెన్షన్ పట్టుకుంది.

Advertisement

జనవరి రెండవవారంలో జగన్ పాదయాత్ర ముగియనుంది.దానికి సూచికగా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభను జగన్ నిర్వహిస్తున్నారు.ఇక్కడే అనేక కీలక ప్రకటను ఉండే అవకాశం కనిపిస్తోంది

ఈ సభలోనే అన్ని పార్టీలకు దిమ్మతిరిగేలా .తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ అనుసరించినట్టే.ముందస్తుగా.

అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించేందుకు సిద్ధం అవుతున్నాడు.మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో సగంపైగా సీట్లను ప్రకటించేందుకు జగన్ సిద్ధం అవుతుండడం.

పార్టీలో హాట్ టాపిక్ గా ఉంది.పనిలో పనిగా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

లోక్ సభ అభ్యర్థుల ప్రకటన కూడా ఉండబోతోందని.వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఇక అభ్యర్థుల ప్రకటన కూడా.ఆషామాషీగా కూడా చేయడంలేదట.

జగన్ కి అన్నీ స్వయంగా తెలుసు, పైగా ఆయన సొంత నివేదికలు ఉండనే ఉన్నాయి.వీటికి తోడు ఎప్పటికపుడు సర్వేలు కూడా చేయిస్తూ మొత్తం అందరి జాతకాలను తన దగ్గర ఉంచుకున్నారని అంటున్నారు.

దాంతో ఎవరికి వేటు, మరెవరికి ఓటు అన్నది అధినేత నోటి వెంట వస్తే తప్ప ఏమీ తెలియని స్థితి ఉంది.ఇచ్చాపురం వేదికగా జగన్ ఎవరికి షాక్ ఇస్తారన్నది ఇపుడు హాట్ టాఫిక్ గా మారింది.

జగన్ ప్రకటించే అభ్యర్థుల లిస్ట్ లో నియోజకవర్గ ఇంచార్జీలే ఉంటారా .? లేక కొత్తవారిని తెర మీదకు తీసుకువస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.అయితే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సింగిల్ ఇంచార్జులకు టికెట్లు ఖాయమేనా అన్న చర్చ కూడా లేకపోలేదు.

దీనికి తోడు ప్రశాంత్ సర్వే టీం ఇప్పటికే పలుమార్లు రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు పూర్తి చేసి గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేశారని.వారికే టికెట్ కేటాయించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.

అయితే కొన్ని కొన్ని వివాదాస్పద నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా.చివరి వరకు సస్పెన్స్ కొనసాగించాలని చూస్తున్నారు.

జగన్ తీసుకునే ఈ సాహసోపేతమైన స్టెప్ పై అటు తెలుగుదేశంలో కూడా ఉత్కంఠ రేపుతోంది.ఎందుకంటే జగన్ ప్రకటించబోయే అభ్యర్థుల లిస్ట్ చూసి టీడీపీ కూడా అభ్యర్థుల లిస్ట్ తయారుచేయాలని చూస్తోంది.

తాజా వార్తలు