Chandrababu naidu : జగన్ పై బాబు పంచ్ లు ! బటన్ నొక్కుడు పై సెటైర్లు 

వైసీపీ అధినేత ,ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై విమర్శలు జోరు పెంచారు టిడిపి అధినేత చంద్రబాబు జగన్ ప్రజలకు ఇస్తున్న హామీలు,  తమకు మళ్లీ ఓటు వేసి గెలిపించాలని జగన్ ప్రజలను కోరుతున్న విధానం పైన చంద్రబాబు తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

ఆయన బట్టన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అంటున్నారు.

కానీ మీరు బటన్ నొక్కితే ఆయన మైండ్ బ్లాక్ కావాలి అలా నొక్కాలి అంటూ చంద్రబాబు( Chandrababu naidu ) ప్రజలకు పిలుపునిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో జనసేన, టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఉన్న చంద్రబాబు రా కదిలిరా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ, స్వయంగా చంద్రబాబు పాల్గొంటున్నారు.

ఈ సభల్లో వైసీపీ పై తీవ్ర సయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు.జగన్ ప్రభుత్వం  విస్మరించిన హామీలపైన చంద్రబాబు ఫైర్ అవుతున్నారు.

విద్యుత్ రంగంలో సంస్కరణలను తీసుకువచ్చింది తామేనని, పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే తన జీవిత ఆశయం అంటూ చంద్రబాబు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.సిద్ధం సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం అంటూ జగన్ ను ప్రశ్నించారు.

Advertisement

ఆయనను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చంద్రబాబు సెటైర్లు వేశారు.రాతి యుగం వైపు ఏపీ వెళ్ళకుండా స్వర్ణ యుగం వైపు వెళ్లాలనేది తన ఉద్దేశమని, కానీ ఇప్పుడు ఎటు చూసినా రాతియుగం నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయని, ఎక్కడికక్కడ దోపిడీ, దౌర్జన్యాలు పెరిగిపోయాయి అని, ఇక వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారని చంద్రబాబు విమర్శలు చేశారు.ఏపీలో హింసా రాజకీయాలు పెరిగిపోయాయి అని, ఎక్కడ చూసినా దారుణాలే కనిపిస్తున్నాయని, వైసీపీ నాయకులు కొందరు దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

ఏపీలో ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లే పరిస్థితి ఉందని, జగన్ ప్రభుత్వం ఒక్క తట్ట మట్టి పోసి ఒక ప్రాజెక్టు అయినా కట్టిందా ? ఉపాధి ఎక్కడ ఉంటుంది అంటూ చంద్రబాబు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.వాలంటీర్ల( Volunteers )కు తాము వ్యతిరేకం కాదని, ఎవరైనా సరే ప్రజలకు సేవ చేయాలన్నదే తాము కోరుకుంటున్నాము అని చెబుతున్నారు.వాలంటీర్లు వైసిపికి సేవ చేస్తే టిడిపి అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టేది లేదని, ప్రజలకు సేవ చేస్తే సత్కరిస్తామని, జగన్ ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు వెళ్లాల్సిందేనని చంద్రబాబు సూచిస్తున్నారు.

తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడుతున్నారు.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు