టీడీపీ( TDP )లో ఉన్న ముఖ్యనేతలతో పార్టీ అధినేత చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు.ఢిల్లీ పర్యటన( Delhi tour ) ముందు చంద్రబాబు పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే కొందరు ముఖ్యనేతలతో చంద్రబాబు( Chandrababu naidu ) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, స్వామి, రామానాయుడుతో పాటు మరి కొంతమంది నేతలు సమావేశానికి హాజరయ్యారు.
అయితే త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జనసేన( Janasena )తో పొత్తు కారణంగా కీలక స్థానాలను వదులుకోకూడదని సీనియర్ నేతలు భావిస్తున్నారు.టీడీపీలోని వివిధ నియోజకవర్గాల్లోని ఆశావహులు పెద్ద ఎత్తున ఉండటంతో టీడీపీ తర్జన భర్జన అవుతున్నారని తెలుస్తోంది.కాగా 2009లో పొత్తు వలన జరిగిన నష్టం రిపీట్ కాకూడదని టీడీపీ భావిస్తోందని సమాచారం.