IPL 2024 : ఐపీఎల్ 2024లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న కెప్టెన్లు వీళ్లే..!

ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే.ఐపీఎల్ ఆడేందుకు ప్రతి ఒక్క ఆటగాడు కూడా చాలా అంటే చాలా ఉత్సాహాన్ని చూపిస్తాడు.

 These Are The Highest Paid Captains In Ipl 2024-TeluguStop.com

ఐపీఎల్ లో ఆడితే క్రేజ్ పెరగడంతో పాటు భారీ పారితోషకం పొందవచ్చు.అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లందరూ ఈ ఐపీఎల్ లీగ్ లో ఆడెందుకు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే ఐపీఎల్ 16 సీజన్లను పూర్తి చేసుకుంది.ఇక 17వ సీజన్( IPL 17 ) కోసం ఐపీఎల్ సిద్ధమవుతోంది.

ఐపీఎల్ జట్ల ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్ల కోసం కోట్ల రూపాయలు వేచిస్తున్నారు.అయితే ఐపీఎల్ జట్ల కెప్టెన్లలో( IPL Captains ) అత్యధిక పారితోషకం తీసుకుంటున్న కెప్టెన్లు ఎవరో చూద్దాం.

Telugu Dhoni, Hardik Pandya, Paid Captains, Ipl, Ipl Captains, Kl Rahul, Rishab

లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ కేఎల్.రాహుల్( KL Rahul ) ఒక్క సీజన్ కోసం రూ.17 కోట్ల వరకు డబ్బులు తీసుకుంటున్నాడు.ఈ జాబితాలో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో నిలిచాడు.ఇక ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్( Rishab Panth ) ఒక్క సీజన్ కోసం రూ.16 కోట్లు తీసుకుంటున్నాడు.రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురి కావడం వల్ల ఐపీఎల్ 16వ సీజన్ ఆడలేదు.ఇక 17వ సీజన్ కోసం ఫ్రెష్ గా మళ్లీ ఢిల్లీ జట్టులోకి అడుగు పెడుతున్నాడు.ఇక ముంబై ఇండియన్స్ కు కొత్తగా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) రూ.15 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు.

Telugu Dhoni, Hardik Pandya, Paid Captains, Ipl, Ipl Captains, Kl Rahul, Rishab

వీరి తర్వాత జాబితాలో కలకత్తా జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రూ.12.25 కోట్ల పారితోషకం, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్( Sanju Samson ) రూ.12 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని( Mahendrasingh Dhoni ) రూ.12 కోట్లు, పంజాబ్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ రూ.8.25 కోట్లు, గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టన్ గా బాధ్యతలు తీసుకుంటున్న శుబ్ మన్ గిల్ రూ.8 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ డూప్లేసిస్ రూ.7కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఎడెన్ మర్క్ రమ్ రూ.2.6 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube