జాడలేని ఆ అభ్యర్థులు..! బాబు కి పెద్ద కష్టమే?

టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద కష్టమే వచ్చి పడింది.2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావాలనే ధృడ లక్ష్యం తో  చంద్రబాబు ఉన్నారు.  దీనికి తగ్గట్లుగానే అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టే విధంగా పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేశారు.అలాగే జనసేన, బిజెపి ల తో తమకు పొత్తు కుదురుతుందని,  తప్పకుండా టిడిపి అధికారంలోకి వస్తుంది అని బాబు నమ్మకం పెట్టుకున్నారు.

 Chandrababu Facing Difficulties In Selecting Tdp Mp Candidates Details, Tdp, Ch-TeluguStop.com

అందుకే ఇప్పటి నుంచే  ఏ నియోజకవర్గం లో ఎవరిని అభ్యర్థిగా పోటీకి దింపితే ఫలితం బాగుంటుంది అనే విషయం పైన దృష్టి సారించారు.అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో ఏ ఇబ్బంది లేకపోయినా , ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఇబ్బందులు ఏర్పడ్డాయట.2019 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ముగ్గురు మినహా అంతా ఓటమి చెందారు.

అప్పటి నుంచి వాళ్లల్లో ముగ్గురు నలుగురు మినహా మిగతా వారంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటు,  అసలు రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండడం,  పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు సైతం హాజరు కాకుండా దూరంగా ఉండటం వంటి కారణాలతో వారు పార్టీలో ఉన్నా,  లేనట్టుగానే భావిస్తూ వచ్చారు.

అయితే 2024 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టు ను ముందుగానే తయారు చేసుకోవాలని చూస్తున్న బాబుకు ఎవరిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలి అనే విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.ఆర్థికంగా , సామాజికవర్గం పరంగా బలమైన నేతలకు టికెట్లు ఇవ్వాలని, మెజారిటీ ఎంపి స్థానాలను దక్కించుకోవాలని చూస్తుండడంతో ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Telugu Ashokgajapathi, Chandrababu, Jagan, Sri Bharath, Tdp Mp Candis-Political

గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వారిలో అశోక్ గజపతి రాజు, శ్రీభరత్, నిమ్మల కిష్టప్ప , జెసి పవన్, కొనకళ్ల నారాయణరావు వంటివారి మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
  మిగతా వారంతా పార్టీకి దూరంగా నే ఉన్నట్లుగా వ్యవహరిస్తుండడం ఇబ్బందికరంగా మారిందట.అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఎంపీ అభ్యర్థులను కాస్త ముందుగానే ఎంపిక చేయడం వల్ల వారిని పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాక్టివ్ చేసేందుకు , ప్రజలకు దగ్గర అయ్యేవిధంగా చూడవచ్చు అనే అభిప్రాయంలో బాబు ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube