చంద్రబాబు నివాసం వద్ద రెండు వర్గాల మధ్య తోపులాట... రాళ్లు, కర్రలతో ఘర్షణ

చంద్రబాబు నివాసం వద్ద రెండు వర్గాల మధ్య తోపులాట… రాళ్లు, కర్రలతో ఘర్షణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు…‌ మాజీ స్పీకర్ కోడెల వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ నేతలు చంద్రబాబు నివాసం వద్ద చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పెద్ద సంఖ్యలో తన అనుచరులతో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు.

 Chandrababu Home Times Syndication Service Clash With Stones And Sticks-TeluguStop.com

ఈ విషయం జోగి ముందే ప్రకటించినప్పటికీ పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆయనను అక్కడ రాకుండా నిలువరించ లేదు.అక్కడకు వచ్చిన తర్వాత కూడా పోలీసుల సమక్షంలో చంద్రబాబు ఇంట్లోకి చొచ్చకెళ్లేందుకు ప్రయత్నించారు.

దీంతో టీడీపీ నేతలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి ఎదురుగా దూసుకురావడంతో రెండు వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది వైసిపి ఆందోళన సమాచారం తెలుసుకున్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్ధ వెంకన్న, పట్టాభి తదితరులు కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.ఇదేం పద్దతి అంటూ వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు.

ఈ సందర్భంగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వైసీపీ నేతలు ప్రతిఘటచారు.ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ళు తో కర్రలతో దాడి చేసుకున్నారు.

దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు.రాళ్ల దాడిలో ఎమ్మెల్యే జోగి రమేష్ కోరారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

టీడీపీ ఎమ్మెల్యే బుద్ధ వెంకన్న స్పృహ తప్పి పడిపోయారు.ఘర్షణ లో తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు జంగాల సాంబశివరావు తలకు, కాలికి గాయాలయ్యాయి పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు.

జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

Telugu Ap, Atcam, Ayyana Pathrudu, Chandra Babu, Cm Jagan, Jogi Ramesh, Ysrcp-Po

తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలు పోలీసుల వైఖరిని నిరసిస్తూ డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.చంద్రబాబు నివాసం పై జరిగిన  దాడి ఘటనకు సంబంధించి మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి మాత్రం లోపలకి ఆహ్వానించారు.

దీంతో టీడీపీ నేతలు పోలీసు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.పోలీసులు వైఖరి నశించాలి అంటూ డీజీపీ పక్షపాత వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు.

డీజీపీ కార్యాలయానికి వెళ్లడానికి ఎందుకు అనుమతి ఇవ్వారంటూ నిలదీశారు.దీంతో పోలీసులు భారీగా మోహరించి టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు.

దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తామని 24 గంటల ముందు వాట్సాప్, ట్విట్టర్ లో ఎమ్మెల్యే ప్రకటించి.కర్రలు, రాళ్లతో దాడికి తెగబడితే పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని టీడీపీ నేతలు ఆరోపించారు.

బుద్ధ వెంకన్న కింద పడేసి కొట్టారని ఆరోపించారు.అధికారపార్టీ నేతలు తమపై దాడి చేసి కొట్టారని జగన్ సర్కారు పై బుద్ధ వెంకన్న మండిపడ్డారు.

జోగి రమేష్ ను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube