2019 ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం( YCP Government ) ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది.వైయస్ జగన్ పాలనలో వాలంటీర్లు( Volunteers ) ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వాలంటీర్లు వారధిగా పనిచేస్తున్నారు.ప్రతి నెల మొదటి తారీకు మొదటి తారీకునే పింఛన్ ప్రతి ఇంటికి అందజేస్తున్నారు.
రేషన్ కూడా అందిస్తున్నారు.ప్రభుత్వానికి సంబంధించి అనేక కార్యక్రమాల విషయంలో ప్రజలకు సహకరిస్తున్నారు.
కరోనా( Covid ) లాంటి సమయంలో వాలంటీర్లు చేసిన కృషి ఎవరు మరువలేనిది.అయితే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నా నేపథ్యంలో ఇతర పార్టీల అధికారంలోకి వస్తే వాలంటీర్లు వ్యవస్థ తీసేయడం జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు సంచలన హామీ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీయం.
అంతేకాదు మేము వాలంటీర్లకు తగిన న్యాయం చేస్తామని అన్నారు. వాలంటీర్లు వ్యవస్థ( Volunteer System ) ఉంటుంది.వాళ్లను తీసేయం.వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.ఎన్నికలలో వారు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నా.అని చంద్రబాబు( Chandrababu ) వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో రాయలసీమకు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారో చెప్పాలని ఓ పార్టీ కార్యక్రమంలో వైసీపీని చంద్రబాబు నిలదీశారు.
వచ్చే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం కూటమి( Janasena TDP ) గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.ఇదే సమయంలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పాలునీళ్లు మాదిరిగా కలిసిపోవాలని.
ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.