సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తూ ఉన్నారు.

ఒకపక్క ప్రభుత్వం పై పోరాడుతూనే మరోపక్క పార్టీ బలోపేతానికి అనేక సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

ఇటువంటి తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ తెలియజేశారు.మేటర్ లోకి వెళ్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యే లందరికీ పార్టీ టికెట్ కన్ఫామ్ చేశారు.

ఇటీవల ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీ లతో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చంద్రబాబు భేటీ కావడం తెలిసిందే.ఈ సందర్భంగా ప్రజా సమస్యల విషయంలో పోరాడుతున్న వారందరికీ టికెట్లు కాయమని స్పష్టం చేశారు.

జగన్ పై వ్యతిరేకత మొదలైందని అన్నారు.ఇదేసమయంలో తనపై వస్తున్న వ్యతిరేకతను జగన్ ఎమ్మెల్యే ల పైకి నెట్టేస్తున్నారని విమర్శించారు.

Advertisement

వచ్చే ఎన్నికలలో గెలుపు విషయంలో వైసీపీ  వర్గాలలోనే కన్ఫ్యూజన్ మొదలైంది అని తెలిపారు.కానీ టీడీపీ ఎమ్మెల్యేలకి అటువంటి భయం అవసరం లేదని చెప్పుకొచ్చారు.

ప్రజా సమస్యలపై మనం చేస్తున్న పోరాటమే మనల్ని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తుందని తెలిపారు.తన స్వార్థ రాజకీయాల కోసం.

ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ అమరావతి విషయంలో జగన్ మడమ తిప్పారని సెటైర్లు వేశారు.ఏది ఏమైనా ప్రజా పోరాటాలు చేసే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వనున్నట్లు చంద్రబాబు చేసిన కీలక ప్రకటన టీడీపీలో సంచలనం రేపింది.

సజ్జలకే మళ్లీ పెద్ద పీట ! జగన్ నమ్మకం పై చర్చ 
Advertisement

తాజా వార్తలు