స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు( Chandrababu ) రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ కేసులో అరెస్టు అయ్యి దాదాపు నెల రోజులు అయ్యింది.
పరిస్థితి ఇలా ఉంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు అస్వస్థతకు గురికావడం జరిగిందట.పూర్తి విషయంలోకి వెళ్తే గత కొద్దిరోజుల నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జైల్లో డిహైడ్రేషన్( Dehydration ) బారినపడ్డారట.
ఆ సమయంలో వైద్యాధికారికి చంద్రబాబు విషయం తెలియజేయడం జరిగిందట.నేడు ములాఖత్ లో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చంద్రబాబు తెలియజేసినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.
చంద్రబాబు వయసు 70కి పైగా కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు.ఇదే సమయంలో చాలామంది కార్యకర్తలు… చంద్రబాబు కేసుల నుంచి బయటకు రావాలని కోరుతూ సర్వ మత ప్రార్థనలు చేస్తున్నారు.
మరోపక్క చంద్రబాబుకు బెయిల్ తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ లీగల్ టీంతో పాటు లోకేష్ కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఢిల్లీ నుండి సుప్రీం కోర్టులో పేరుగాంచిన లాయర్ల చేత చంద్రబాబు కేసును వాదిస్తూ ఉన్నారు.
సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని వైసీపీ పై మండిపడుతున్నారు.







