సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోయిన్లు( Heroines ) సక్సెస్ఫుల్ హీరోయిన్లు గా కొనసాగడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు.కానీ ఇక్కడ అవకాశం రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
అందులో భాగంగానే సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్లు చేసీ వాళ్ల లక్కును పరీక్షించుకుంటారు.అయితే అవకాశం వచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ కూడా స్టార్ హీరో అవ్వలేదు.
ఇక్కడ సినిమాలనేవి హిట్టు పడుతూ ఉండాలి లేకపోతే ఇండస్ట్రీలో ఎవ్వరికీ కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఏది ఉండదు ఎన్నో అంచనాల మధ్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి రెండు సినిమాలతో సక్సెస్ లు కొట్టి స్టార్ హీరోయిన్ గా చాలా కాలం ఇండస్ట్రీ లో హీరోయిన్లు గా కొనసాగుతారు.అని అనుకున్న వాళ్లలో కొందరికి ఇప్పుడు అవకాశాలు లేక ఫెడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ( Venkatadri Express )సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీతిసింగ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగి చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతుందని అందరు అనుకున్నారు.కానీ స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పటికీ ఆమెకు ఏ ఒక్క స్టార్ సినిమా కూడా పెద్దగా ఆడలేదు దాంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చే వాళ్ళు కరువైపోయారు దాంతో ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటుంది.

దానికి తోడు ఒక సంవత్సరం కిందట ఆమె పేరు డ్రగ్స్ కేసులో ఎక్కువగా వినిపించడంతో ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూడకుండా సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయింది.ఒకవేళ తెలుగులో మంచి అవకాశాలు వస్తే మళ్లీ తెలుగు సినిమా చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పుడు ఆమెకు తెలుగులో అవకాశాలు ఇచ్చే హీరోలు కరువైపోయారు… స్టార్ హీరోలతో చేసిన సినిమాల్లో నాన్నకు ప్రేమతో సినిమా ఒక్కటే ఆమెకి మంచి విజయాన్ని అందించింది
.







