ఇటీవల సిఐడి అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అమరావతి భూముల విషయంలో నోటీసు ఇవ్వటం అందరికీ తెలిసిందే.రాజధాని అమరావతి ప్రాంతంలో దళితులకు చెందిన అసైన్డ్ భూములను అన్యాయంగా లాక్కున్నారని, ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ఈ భూములు వల్ల చంద్రబాబు అండ్ కో 500 కోట్ల అవినీతి సొమ్మును లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే ఆర్ కె చేసిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు ఇటీవల హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చే విచారణకు హాజరుకావాలని తెలిపారు.
దీంతో తనకు ఇచ్చిన నోటీసులు విషయంలో హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.ఈ విషయంలో సిఐడి నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు.
తనపై సిఐడి నమోదు చేసినఎఫ్ఐఆర్ నీ వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు తరఫున న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.అయితే ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది అని సమాచారం.
ఇదిలా ఉంటే తనకి వచ్చిన సిఐడి నోటీసుల విషయంలో అదేవిధంగా త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనేదానిపై పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు త్వరలో సమావేశం కానున్నట్లు టిడిపి పార్టీలో టాక్.
.