94 రేప్ సీన్లలో నటించి రికార్డు కొట్టిన నటుడు అతనే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాల నుంచి ఎన్నో విభిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న చలపతిరావు తను వయసులో ఉన్నప్పుడు ఏ సినిమాలోనైనా రేప్ సీన్లు ఉన్నాయంటే వెంటనే దర్శకనిర్మాతలకు గుర్తొచ్చేది చలపతిరావు.

మూడు దశాబ్దాల కిందట వచ్చిన ప్రతి సినిమాలో కచ్చితంగా రేప్ సీన్లు ఉంటాయి.ఆ సీన్లను పెట్టడంతోనే ఆ సినిమా కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది.అలా రేప్ సీన్లు ఉన్నాయంటే ఆ సినిమాలో కచ్చితంగా చలపతిరావు మనకు కనిపిస్తారు.

మనం సినిమాలో చూసే రేప్ లు ఉత్తుత్తివే అయినా కానీ వాటిని ఎంతో అద్భుతంగా తెరపై పండించడంలో చలపతిరావుకు ఎవరు సాటి లేరు.చలపతిరావు దాదాపు వెయ్యికి పైగా సినిమాలలో నటించారు.

అందులో 94 రేప్ సీన్ లలో నటించి రికార్డును సృష్టించారు.సినిమాలపై ఎంతో ఆసక్తి ఉన్న చలపతిరావు మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ఎదురు చూశారు.

అలా అవకాశాలు రావడంతో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇండస్ట్రీలో కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత తండ్రి పాత్రలు, సోదరుడి పాత్రలో నటిస్తున్నారు.

అప్పట్లో ఎన్టీఆర్ తో ఎంతో సాన్నిహిత్యం ఉండేది.రావు గోపాలరావు విలన్ గా నటించే సినిమాలలో ఏవైనా రేప్ సీన్లు ఉన్నాయంటే అందుకు మన చలపాయ్ ఉన్నాడుగా.

అని వారే స్వయంగా చెప్పేవారు.అన్ని రేప్ సీన్ల లో నటించిన చలపతిరావుని బయట ఎవరైనా చూస్తే తన నుంచి దూరంగా వెళ్లిపోయారు.

ఆయన బాగా తాగి ఎవరైనా ఆడవాళ్లు కనిపిస్తే వాళ్ళని రేప్ చేస్తాడనే ప్రచారం బయట ఉండడంతో, చివరికి అవుట్ డోర్ షూటింగ్ అప్పుడు తను నివసించే హోటల్లో హీరోయిన్లు ఉండటానికి కూడా వెనకాడేవారంటే తను ఏ స్థాయిలో రేప్ సీన్ లను తెరపై పండించి ఉంటారో మనకు అర్థమవుతుంది.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

తాజా వార్తలు