రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు ఎవరు అంటే టక్కున ఎవరైనా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) పేరే మొదట చెబుతారు.40 ఏళ్ల అనుభవంతో అపార చాణక్యుడిగా పేరు గాంచిన చంద్రబాబు పోలిటికల్ వ్యూహాలు రచించడంలో సిద్దహస్తుడు అనే సంగతి అందరికీ తెలిసిందే.ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు రచించాలి.ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగాలి అనేది బాబు కు తెలిసినంతగా మరే నాయకుడుకి తెలియదంటే అతిశయోక్తి కాదు.ఇక వచ్చే ఎన్నికల్లో విజయం కోసం గట్టి పట్టుదలగా ఉన్న చంద్రబాబు.వైసీపీని దెబ్బకొట్టే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలేలా కనిపించడంలేదు.
జగన్ పై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లో మరింత రెట్టింపు చేసేలా.ఇదేం కర్మరా రాష్ట్రనికి, సైకో జగన్, బాదుడే బాదుడు అంటూ ఇలా ఎన్నో రకాల నినాదాలతో జగన్ వైపు నుంచి ప్రజల దృష్టి చంద్రబాబు వైపు మల్లేలా పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు.
ఇక ఈ విమర్శల సంగతి అటుంచితే జగన్ ను ఇబ్బంది పెడుతున్న ప్రతి సమస్యను కూడా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.

ఈ మద్యకాలంలో జగన్ ను అత్యంతా ఇబ్బంది పెడుతున్న అంశం వైఎస్ వివేకా హత్య కేసు( YS Vivekananda Reddy ).ఈ కేసును నిగ్గు నిగ్గు తెల్చేందుకు ఆయన కుమార్తె వైఎస్ సునీత ఎంత పట్టుదలగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం.దాంతో ఈ కేసు వ్యవహారం ఎటొచ్చీ జగన్ వైపు మల్లుతుండడంతో.
ఆయన ఇరకాటంలో పడుతునంట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే సునీతను రాజకీయంగా మరింత యాక్టివ్ చేస్తే.వైసీపీకి బారిగానే డ్యామేజ్ జరుగుతుందని, అది కాస్త టీడీపీకి ప్లేస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట.అందుకే సునీతను టీడీపీలోకి ఆహ్వానించేందుకు బాబు ప్రయత్నిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కడప టీడీపీ శ్రేణులు వైఎస్ సునీత( YS Sunitha )తో చర్చలు జరిపేందుకు కూడా సిద్దమయ్యారట.

అయితే ప్రస్తుతం డాక్టర్ గా ఉన్న సునీత రాజకీయాల్లోకి వస్తారా అనేది ప్రశ్నార్థకమే.ఒకవేళ వస్తే.కడప జిల్లా జగన్ ( YS Jagan Mohan Reddy )కు బారిగా నష్టం తప్పదని విశ్లేషకుల అంచనా.
వైసీపీ కడప కంచుకోటను బద్దలుకొడతామని చెబుతున్నా బాబు.అందుకోసం సునీతను రంగంలోకి దించితే బాబు ప్లాన్ వర్కౌట్ అయినట్లేనని కొందరి అభిప్రాయం.మరి వైఎస్ సునీత అడుగులు టీడీపీ వైపు పడతాయో లేదో చూడాలి.







