రైతులకు రూ.3.75 లక్షలు ఇవ్వనున్న కేంద్రం.. ఎలా పొందాలంటే?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

రైతుల కోసం కొత్త పథకాలను అమలు చేస్తూ వారికి మేలు చేకూరుస్తోంది.

పీఎం కిసాన్ పథకం ద్వారా మోదీ సర్కార్ రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు మూడు విడతల్లో అందజేస్తోంది.తాజాగా యువ రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రైతులు ఎవరైతే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తారో వారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.సాధారణంగా ఎవరైనా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసుకోవాలంటే 5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది.అయితే ఈ మొత్తంలో మూడొంతులు అనగా 3.75 లక్షల రూపాయలు కేంద్రం సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ పెట్టుకునే వారికి కేంద్రం అందిస్తుంది.మిగిలిన 1.25 లక్షల రూపాయలు మాత్రం మనం పెట్టుబడి రూపంలో పెట్టాల్సి ఉంటుంది.సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ పెట్టుకోవాలంటే పరీక్షలు చేసే మిషన్లు, అవసరమైన రసాయనాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

కంప్యూటర్, స్కానర్, ఇతర వస్తువులను కూడా మనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు కేంద్రం అందించే ప్రయోజనాలను పొందవచ్చు.డిస్ట్రిక్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ను కలిసి ఎవరైనా ల్యాబ్ ను ఏర్పాటు చేయవచ్చు.

Advertisement

soilhealth.dac.gov.in వెబ్ సైట్ లేదా 1800 180 1551 నంబర్ కు కాల్ చేసి ఈ స్కీమ్ కుసంబంధించిన పూర్తి సమాచారాన్ని సులభంగా పొందవచ్చు.కేంద్రం ఈ స్కీమ్ ద్వారా యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రైతులు వారి గ్రామాల్లోనే భూసార పరీక్షలు నిర్వహించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు