ఏపీ భవన్ విభజన( AP Bhavan Division )పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశం జరగనుంది.ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ సమావేశానికి హాజరుకానున్నారు.
అటు తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ హాజరు కానున్నారు.కాగా ఏపీ భవన్ విభజన, 58:42 నిష్పత్తిలో భూ పంపకాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో హోంశాఖ కార్యదర్శి చర్చించనున్నారు.
.