మన దేశంలో టీవీలేని ఇల్లే లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అవును, టీవీ సీరియల్ చూడనిదే మనఇంటి ఆడవాళ్లకు పొద్దయినా గడవదు.
అయితే ఈరోజుల్లో టీవిలో రకరకాల ఛానళ్లు చూడాలంటే తప్పనిసరిగా సెట్ టాప్ బాక్స్ ఉండాల్సిందే.నెలకి దాదాపుగా ఇపుడు 350 రూపాయలు వెచ్చిస్తే కానీ, కుటుంబమంతా కలిసి నచ్చిన టీవీ ఛానల్ చూడలేం.
అదే స్పోర్ట్స్ చానెల్స్ కావాలంటే మరో 100 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి.పోనీ ఫ్రీ చానెల్స్ చూస్తూ సమయం గడుపుదామన్నా సెట్ టాప్ బాక్స్ అయితే తప్పనిసరి.

ఇలాంటి తరుణంలో సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండానే టీవీ చానెల్స్ చూసే అవకాశం వస్తే ఎలాగుంటుంది?అదుర్స్ కదూ! అవును, కేంద్ర ప్రభుత్వం ఇపుడు మీకొరకు, మీ కుటుంబం కొరకు సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండానే టీవీ చానెల్స్ చూసే అవకాశం కల్పిస్తోంది.అందుకోసం టెలివిజన్ సెట్‌లలో ఇంటర్నల్ శాటిలైట్ ట్యూనర్లను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా 200కి పైగా చానెల్స్ ను ఉచితంగా వీక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సెట్ టాప్ బాక్స్ ల ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తోంది.

అందుకోసం టెలివిజన్ సెట్‌లలో ఇంటర్నల్ శాటిలైట్ ట్యూనర్లను ఏర్పాటు చేయనుంది.దీనికోసం టెలివిజన్ సెట్లతో పాటు ఓ యాంటెన్నా వస్తుంది.దీనిని ఇంటి పైకప్పు, లేదా గోడల మీద, లేదా అనుకూలంగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది.దీని ద్వారా ఫ్రీ-టు-ఎయిర్ టెలివిజన్, రేడియో ఛానెల్స్ ప్రసారాలను పొందే అవకాశం కలుగుతుంది.
కాగా, బిల్ట్ ఇన్ శాటిలైట్ ట్యూనర్ల ఏర్పాటుపై బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ జారీ చేసిన ప్రమాణాలను పాటించేలా టెలివిజన్ తయారీదారులకు ఆదేశాలు జారీ చేయాలని గతేడాది డిసెంబర్‌లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అనురాగ్ ఠాకూర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.








