కాళేశ్వరానికి జాతీయ హోదాపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..

కాళేశ్వరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది.

 Central Government Clarity On National Status For Kaleswaram , Kaleswaram , Na-TeluguStop.com

అసలు ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే స్కీమ్ లో చేర్చే అర్హత కూడా లేదని… పార్లమెంటు సాక్షిగా చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఎందుకు జాతీయ హోదా ఇవ్వడంలేదు ? అసలు తప్పెక్కడ జరిగింది ?

Telugu Central, National Status, Cm Kcr, Congressmp, Kaleswaram, Narendra Modi,

తెలంగాణ సర్కారు తను చేసిన గొప్ప పనుల గురించి చెప్పుకోమ్మంటే… ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పి.ఆ తర్వాతే ఇతర ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తుంది.వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని 2016 లోనే తెలంగాణ ప్రభుత్వం కోరింది.

అప్పుడే కేంద్రం జాతీయ హోదా ఇవ్వమంటూ స్పష్టం చేసినా… ఇదే హోదాపై తెలంగాణ ప్రభుత్వానికి – కేంద్ర ప్రభుత్వానికి మధ్య పలు మార్లు ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి.ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడం కుదరదంటే కుదరదని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది.ఎందుకంటే… కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదని.ఈ నేపథ్యంలో జాతీయ హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం వివరించింది.

Telugu Central, National Status, Cm Kcr, Congressmp, Kaleswaram, Narendra Modi,

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారని.అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని… నిర్మాణ అనుమతి కోరితే… ఈ అంశాన్ని పరిశీలించడానికి కేంద్రం ఒక హైపవర్ స్టీరింగ్ కమిటీ నియమిస్తుందని.ఆ కమిటీ పరిశీలన తర్వాతే.

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఉంటే.కేంద్రం జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉంటుందని కేంద్ర జలశక్తిశాఖ సహాయక మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు.

అంతేకాదు కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ కూడా లేదని.దీంతో ఈ ప్రాజెక్టును జాతీయ హోదా ప్రాజెక్టుల జాబితాలో చేర్చే అర్హత కూడా సాధించలేకపోయిందని మంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా… గోదావరి నది జలాలను ఎత్తిపోసి.లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు.

ప్రపంచంలో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు ఎక్కడా లేదని ఎన్నో సందర్భాల్లో ఘనంగా చెప్పుకున్నారు.ఐతే అదే కాళేశ్వర ప్రాజెక్టులు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube