టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ.
ఇది ఇలా ఉంటే రామ్ గోపాల్ వర్మ కు ప్రస్తుతం ప్రతి చోటా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కొంతమంది నిర్మాతలు ఆర్జీవి నిర్మాతలు ఇచ్చిన డబ్బులు వర్మ తిరిగి ఇవ్వడం లేదు అని కేసులు పెడుతున్నారు.
మరొకవైపు రాంగోపాల్ వర్మ సినిమా పోస్టర్ లని ప్రభుత్వం అధికారులు దగ్గరుండి మరి చింపేస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే.
రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన మార్షల్ ఆర్ట్స్ సినిమా లడ్కీ.ఇందులో పూజ భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఇటివలె విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్స్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అయితే మార్షల్ ఆర్ట్స్ సినిమా పేరుతో హీరోయిన్ పూజ అందాలను చూపిస్తూ తెరకెక్కించిన తీరు అలాగే ఈ సినిమాలో ఫైట్ సీన్స్ పై పలువురు ఇప్పటికే ఘాటుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఇంకొందరు అయితే ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ కోసం కాకుండా హీరోయిన్ పూజ అందాల ప్రదర్శన కోసమే రూపొందించినట్టుగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.జూలై 15వ తేదీన విడుదలైన ఈ సినిమాని ఆపాలి అంటూ శేఖర్ రాజా అనే ఒక ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మపై కోర్టుకు వెళ్లి స్టేను తీసుకుని వచ్చారు.

ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ కు మరొక ఇబ్బంది ఎదురయ్యింది.రాంగోపాల్ వర్మ సినిమాకు సంబంధించిన రిలీజ్ పోస్టర్లని నరసరావుపేటలోని ప్రధాన రహదారుల్లో ఉన్న గోడలపై అతికించారు.ఈ విషయం కాస్త నరసరావుపేట కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ లడ్కీ సినిమాకు సంబంధించిన పోస్టర్లను సిబ్బందిని పిలిపించి మరీ ఆయనే దగ్గర ఉండి చింపేపించారు.అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సినిమా హాలు యాజమానులతో మాట్లాడి, అశ్లీల పోస్టర్ల విషయమై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని నరసరావుపేట కలెక్టర్ థియేటర్ యాజమాన్యాలను మందలించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరి ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.







