సుడిగాలి సుధీర్ మళ్ళీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తాడా.. హైపర్ ఆది సూపర్ క్లారిటీ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరిగా కమెడియన్స్ వెళ్ళిపోతూ ఉండడంతో రేటింగ్ విషయంలో అంతకంతకు వెనుకబడిపోతోంది జబర్దస్త్ జడ్జీగా ఉన్న నాగబాబు వెళ్ళిపోయిన తరువాత ఆయనతో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, ధనరాజ్, వేణు లాంటి పాపులర్ కమెడియన్ లు బయటికి వెళ్లిపోయారు.

 Hype Aadi Clarification On Sudigali Sudheer Jabardasth Re Entry At Sridevi Dram-TeluguStop.com

జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన కమెడియన్లు వేరే ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ షోలో చేస్తున్నారు.అలాగే జబర్దస్త్ జడ్జి రోజా మంచి పదవి దక్కడంతో జబర్దస్త్ షూటింగ్ గుడ్ బాయ్ చెప్పేసిన విషయం తెలుస్తుంది.

ఆ తరువాత సుడిగాలి సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆది లాంటి పాపులర్ కమెడియన్లు జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు.ఇక యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్‌ నుంచి తప్పుకుందనే వార్తలు వినిపించాయి.

కాగా జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి ఇటీవలే మల్లెమాలపై జబర్దస్త్ గురించి, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి నోటికి వచ్చిన విధంగా వాగుతూ వివాదాస్పద వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరు విడిచి బయటకు వచ్చేస్తారు అంటూ ఆర్పి సంచలన వాక్యాలు చేశాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా సుడిగాలి సుధీర్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఒక క్లారిటీ ఇచ్చారు.శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుంచి సుధీర్ హోస్ట్ గా చేయకుండా వేరే ఛానల్‌కి జంప్ చేయడంతో ఆ ప్లేస్ లోకి యాంకర్ రేష్మి వచ్చి చేరింది.

ఇక తాజావదిలిన ప్రోమోలో రష్మికి బీభత్సమైన హైప్ ఇస్తూ ఆమె బయోగ్రఫీతో ఎమోషనల్ ప్రోమో వదిలారు.పనిలో పనిగా జబర్దస్త్‌ని వీడిని వీడబోతున్నారంటూ వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఆ తర్వాత ఒక వ్యక్తిని పిలుచుకొని వచ్చి అతనితో పలు రకాల ప్రశ్నలను అడిగించారు.ఈ క్రమంలోనే హైపర్ ఆదిని ఉద్దేశిస్తూ.మీరు జబర్దస్త్‌లో కనిపించడం మానేశారు.చాలామంది ఈ షో నుంచి వెళ్లిపోతున్నారు.

మీరు కూడా వెళ్లిపోతున్నారని అంటున్నారు? నిజమేనా? అని అడగగా అతను అడిగిన దానిపై ఆన్సర్ ఇచ్చాడు.ఆ తరువాత సుధీర్ రీ ఎంట్రీ కి సంబంధించిన విషయాలను కూడా తెలిపినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube