ఏపీ జీవనాడి ప్రాజెక్ట్ పోలవరం సవరించిన అంచనాలకు సంబంధించి కేంద్ర ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.ఈ మేరకు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షేకవత్.
పోలవరం సవరించిన అంచనాల కు ఆమోదం తెలపడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం 47,725 రూ.కోట్లకు పోలవరం అంచనాలు సవరించారు.ఈ క్రమంలో కేంద్ర జల శక్తి సవరించిన అంచనాల కు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపించనుంది.

ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ దృష్టికి వెళ్ళడం అక్కడ ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరగనున్నాయి.వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ఈ ఏడాది జూన్ లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.మహమ్మారి కరోనా తీసుకొచ్చిన కారణాల వల్ల.అనుకున్న సమయం దాటిపోయింది.మరోపక్క అంచనా వ్యయం పెరిగిపోతూ ఉండటంతో ప్రాజెక్టు అంచనాల్లో మార్పులు చేసి.రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్దకు వెళ్లగా తాజా అంచనాలకు కేంద్ర జలశక్తి ఆమోదం తెలపడంతో.
పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు సమాచారం.