కోవాక్సిన్ టీకాపై పోస్టల్ స్టాంపు విడుదల చేసిన కేంద్రం..!

దేశంలోని ప్రజలందరిని కరోనా వైరస్ ముప్పతిప్పలు పెట్టింది.ఈ మహమ్మారి వైరస్ వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

మారేందరో నిస్సహాయులయిపోయారు.కరోనాని కట్టడి చేసే క్రమంలో మన దేశం వాక్సిన్ ను కనిపెట్టి, పంపిణీని ప్రారంభించి ఇప్పటికి ఒక సంవత్సరమైంది.

ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా కనిపెట్టిన కొవాగ్జిన్ టీకాపై కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును ప్రవేశపెట్టింది.కరోనా నియంత్రణ కోసం భారతదేశంలోకి అందుబాటులోకి తీసుకొచ్చిన కోవ్యాక్సిన్ ఇప్పటికే 70% మందికి వేయడం పూర్తయింది.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఎంతో మెరుగైన ఫలితాలనిచ్చింది అనే చెప్పాలి.ఈ క్రమంలో వాక్సిన్ ప్రక్రియ ప్రారంభం అయ్యి ఏడాది అవ్వడంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం అంటే జనవరి 16 న కోవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపును విడుదల చేయడంతో పాటు ఈ విధంగా స్పందించారు.

Advertisement

భారత దేశంలో కరోనా టీకా పంపిణీ ఒక యజ్ఞంలా జరిగిందని ఆ యజ్ఞాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయిందని అన్నారు.

అంతేకాకుండా మన ప్రధాని నరేంద్రమోదీ కలలుకన్న స్వావలంబన భారత్ సాధనలో కొవాగ్జిన్ టీకా తయారీ ఓ కీలక పరిణామం అని చెప్పుకొచ్చారు.భారత్ సాధించిన ఘనతలో ఇది కూడా ఒకటి అని తెలిపారు.ఎంతో జనాభా కలిగిన భారత్ లో వ్యాక్సిన్ రూపంలో కరోనాను కట్టడి చేయటం అంటే మాములు విషయం కాదని, ఈ విషయంపై ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయాయని తెలిపారు.

అలాగే వాక్సిన్ కనిపెట్టే క్రమంలో కృషి చేసిన శాస్త్రవెత్తలకు, కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలను కాపాడిన వైద్య సిబ్బంది అందరికి నా ధన్యవాదాలు అని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలియచేసారు.

చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు