జుట్టు స్మూత్‌గా మారాలా..అయితే ఆముదంతో ఇలా చేయండి!

సాధార‌ణంగా కొంద‌రి జుట్టు ఎప్పుడూ బ‌ర‌క‌గా ఎండిపోయిన‌ట్టు క‌నిపిస్తుంది.

ఆహార‌పు అల‌వాట్లు, ఎండ‌ల ప్ర‌భావం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూల వాడ‌కం, పోష‌కాల లోపం, కాలుష్యం, త‌లస్నానం చేయ‌క‌పోవ‌డం, కేశాల విష‌యంలో స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు డ్రైగా మారిపోతుంది.

దాంతో ఏం చేయాలో తెలియ‌క బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతూ హెయిర్ ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటారు.అయితే ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటే మీకు తాత్కాలికంగానే ప‌రిష్కారం ల‌భిస్తుంది.

కానీ, ఇంట్లోనే కొన్ని కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ పాటిస్తే శాశ్వ‌త ప‌రిష్కారం పొందొచ్చు.ముఖ్యంగా డ్రై హెయిర్‌ను స్మూత్‌గా, షైనీగా మార్చ‌డంలో ఆముదం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఆముదంను ఎలా యూజ్ చేయాలి అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఆముదం, రెండు స్పూన్ల క‌ల‌బంద గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకుని త‌ల‌కు, కేశాల‌కు బాగా ప‌ట్టించాలి.

Advertisement

ఒక గంట పాటు ఆర‌నిచ్చి ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటిలో త‌ల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మీ జుట్టు స్మూత్‌గా, అందంగా మారుతుంది.

అలాగే రెండు స్పూన్ల ఆముదం, ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె రెండిటినీ ఒక గిన్నెలో తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు అప్లై చేసి అర గంట నుంచి గంట పాటు వ‌దిలేయాలి అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూతో హెడ్ బాత్ చేసేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు స్మూత్‌గా, సిల్కీగా మారుతుంది.

ఒక గిన్నెలో ఆముదంను తీసుకుని గోరు వెచ్చ‌గా చేయాలి.ఆ త‌ర్వాత అందులో కొద్దిగా నిమ్మర‌సం యాడ్ చేసి త‌ల‌కు అప్లై చేయాలి.

ఇలా రాత్రి నిద్రించే ముందు చేసి ఉద‌యం త‌ల‌స్నానం చేయాలి.వారంలో రెండు లేదా మూడు సార్లు ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు