తమతో పడుకుని కోరిక తీర్చుకున్నాక కూడా అవకాశాలు ఇవ్వడం లేదు... 

ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు మరియు లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని బలమైన చట్టాలు మరియు కఠిన చర్యలు అమలులోకి తీసుకొచ్చిన ప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆగడాలు మాత్రం ఆగడం లేదు.అయితే ఈ లైంగిక వేధింపులు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

 Casting Couch Problems In Tollywood Film Industry, Tollywood Film Industry, Cas-TeluguStop.com

ఇందులో కొందరు అవకాశాలకోసం సర్దుకుపోతుంటే మరికొందరు మాత్రం పడక సుఖం ఇచ్చిన తర్వాత కూడా అవకాశాలు ఇవ్వడం లేదని అలాగే తమ కోరికలు తీర్చు కున్న తర్వాత మొహం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆ మధ్య ఓ ప్రముఖ వార్తా చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కొంతమంది సినిమా పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్టులు మరియు మేకప్ ఆర్టిస్టులు తదితరులు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ అవకాశాల కోసం కొంతమంది దర్శక నిర్మాతలకి పడకగది కమిట్మెంటు ఇచ్చానని కానీ తనతో అవసరం తీరిపోయాక ఆ దర్శకనిర్మాతలు కనీసం ఫోన్ కూడా ఎత్తడం మానేశారని ఆవేదన వ్యక్తం చేసింది.అంతేకాక సినిమా పరిశ్రమలో చాలా మంది మంచి దర్శకనిర్మాతలు ఉన్నప్పటికీ కొంతమంది అసిస్టెంట్ దర్శకులు మరియు కో డైరెక్టర్లు తదితరులు మంచి వాళ్ళని కలవనివ్వకుండా అడ్డు పడుతున్నారని ఎమోషనల్ అయ్యింది.

అయితే అవకాశాల కోసం గుట్టుచప్పుడు కాకుండా కమిట్మెంట్ ఇచ్చిన వారి ఫోన్ నంబర్లను కొంతమంది తమ స్నేహితులకు మరింత మందికి షేర్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా వాపోయింది.ఎన్నో కష్టాలు ఎదుర్కొని కుటుంబ పరిస్థితుల కారణంగా సినిమా పరిశ్రమలో పనిచేయాలని వచ్చినటువంటి తనలాంటి అభాగ్యులను కొంతమంది అవకాశాల పేరుతో వాడుకొని వదిలేస్తున్నారని తెలిపింది.

కనీసం ఇప్పటికైనా ఈ విషయం సినీ ఇండస్ట్రీలోని పెద్దలు గుర్తించి ఇలాంటివాటి కి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరింది.

దీంతో జూనియర్ ఆర్టిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ విషయంపై చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

సినిమా పరిశ్రమలో పని చేసినటువంటి ఆర్టిస్టులకు బాహ్య ప్రపంచంతో ఎక్కువగా సంబంధాలు ఉండటంతో ఇలాంటి కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.మరి కనీసం ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు ఈ కాస్టింగ్ కౌచ్ నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube