తెలంగాణలో బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) అన్నారు.కులగణన తీర్మానం కంటి తుడుపు చర్యని విమర్శించారు.
కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని పేర్కొన్నారు.స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్యని తెలిపారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ( Congress )పార్టీది బీసీ వ్యతిరేక చరిత్రన్న ఎమ్మెల్సీ కవిత కులగణనకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలని కోరారు.
బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.







