నోరు జారిన జేసీపై కేసు నమోదు

మన దేశంలో బలమైన రాజ్యాంగం ఉంది.ఆ రాజ్యాంగకు లోబడే ఎన్నికలు జరగాలి, పాలన సాగాలి.

రాజ్యాంగం లోని ప్రతి నియమ నిబంధనను తప్పకుండా పాటించాల్సిందే.ఒకవేళ పాటించకుంటే శిక్షార్హులు అవుతారు.

ఎన్నికల్లో పోటీకి ఇంత ఖర్చు అంటూ రాజ్యాంగంలో ఉంది.అయితే అంతకు మించి ప్రతి ఒక్కరు ఖర్చు పెడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు అంగీకరించే విషయం.

అయితే తాజాగా మీడియా ముందు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.కోట్లు లేకుండా ఓట్లను అడుగలేక పోతున్నాం.

Advertisement

గత ఎన్నికల్లో నేను, నా ప్రత్యర్థి కలిసి ఏకంగా 50 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం అంటూ ప్రకటించాడు.మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు.

ఈ విషయమై ఈసీ సీరియస్‌గా తీసుకుని కలెక్టర్‌ విచారణకు ఆదేశించింది.రాష్ట్రవ్యాప్తంగా పది వేల కోట్ల రూపాయలు ఈ ఎన్నికలకు ఖర్చు అయ్యి ఉంటుందని జేసీ అనడం ఆమద్య సంచలనం అయ్యింది.

తాజాగా ఆ విషయమై జేసీపై కేసు నమోదు అయ్యింది.ఎన్నికల్లో అడదిడ్డంగా ఖర్చు చేసినందుకు గాను జేపీపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు.

ఈ విషయమై వివాదం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు