కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రైతులకు మద్ధతు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే.
దీంతో బండి సంజయ్, ఏనుగు రవీందర్ రెడ్డి సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మరోవైపు అడ్లూర్ ఎల్లారెడ్డిలో నిన్న బండి సంజయ్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ్టి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.
అదేవిధంగా రైతులపై దాడికి నిరసనగా ఇవాళ కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది.కలెక్టర్ ఇప్పటిదాకా కలవకపోవడంపై బాధిత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







