మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా మరో వారం రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసేందుకు సిద్ధం అవుతుంది.
2023 సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ మల్టీ స్టారర్ మూవీ కోసం ఇటు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు అటు మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక విషయంలో కొన్ని రోజుల నుండి సస్పెన్స్ నడుస్తుంది.ముందుగా వైజాగ్ లోని ఆర్ కే బీచ్ దగ్గర వేదిక ఫిక్స్ చేయగా అక్కడ అధికారుల నుండి అనుమతి రాలేదు.
దీంతో ఈ వేదికను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కి మార్చారు.అయితే ఇక్కడ నుండి కూడా వేదిక మారినట్టు తాజాగా సమాచారం అందుతుంది.వస్తున్న వార్తల ప్రకారం వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముందుగా అనుకున్న విధంగానే ఆర్కే బీచ్ లోనే చేయబోతున్నారు అని టాక్.ఈ సినిమాలో గంగ పుత్రునిగా కనిపించనున్న మెగాస్టార్ మొత్తానికి గంగమ్మ ఒడ్డునే ఈవెంట్ చేసుకుంటున్నారని చెప్పాలి.
ఇక ఈ సినిమా జనవరి 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి మెగాస్టార్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో.







