కిడ్నీలో రాళ్లు.ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపిస్తున్న సమస్య ఇది.
వాటర్‌ను సరిగ్గా తాగకపోవడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు, ప్రోటీన్‌ను మోతాదుకు మించి తీసుకోవడం, హైపర్ థైరాయిడ్ ఇలా రకరకాల కారణాల వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి.ఇవి చిన్న సైజ్‌లో ఉంటే వాటంతట అవే బటయకు వచ్చేస్తాయి.
కానీ, పెద్దగా ఉంటే మాత్రం మూత్ర విసర్జన సమయంలో తీవ్ర నొప్పిని కలిగిస్తాయి.
అలాగే వాంతులు కావడం, వికారంగా ఉండటం, జ్వరం, మూత్రం తరచూ రావడం ఇలా ఎన్నో సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.
అందుకే కిడ్నీలో రాళ్లను ఎంత త్వరగా నివారించుకుంటే అంత మంచిది.లేదంటే ఆపరేషన్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.
అయితే కిడ్నీలో రాళ్లను త్వరగా కరిగించుకోవాలనుకుంటే కేవలం మందులు వాడటం మాత్రమే కాదు.కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ముఖ్యంగా కిడ్నీలో రాళ్లను కరిగించడంలో వాము అద్భుతంగా సహాయపడుతుంది.వంటల్లో విరి విరిగా ఉపయోగించే వాములో విటమిన్స్, మినరల్స్, ఫైడర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.
అందుకే వాము ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్న వారు వాముని వాడితే ఎంతో మేలు.మరి వామును ఎలా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ వాటర్‌తో అర స్పూన్ వాము వేసి రాత్రంతా నాన బెట్టాలి.
ఉదయాన్ని ఆ వాటర్‌లో కొద్దిగా స్వచ్ఛమైన తేనె కలిసి సేవించాలి.ఇలా ప్రతి రోజు చేస్తే.
కిడ్నీలో రాళ్లు క్రమంగా కరుగుతాయి.అలాగే వామును లైట్‌గా డ్రై రోస్ట్ చేసి ఆ తర్వాత బాగా దంచుకోవాలి.
ఇప్పుడు ఈ వాము పొడిని మజ్జిగలో కలిపి తీసుకోవాలి.ఇలా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.