విశాఖపట్నంలోని భీమిలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది.డివైడర్ ను ఢీకొన్న కారు అదే వేగంతో బస్సు, లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.అయితే ఘటన చోటు చేసుకోవడానికి కారు డ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మృతులు శ్రీకాకులం జిల్లా వ్యాస్తవ్యులు లాడే దుర్గాప్రసాద్, పట్నాల సంతోష్ లుగా గుర్తించారు.