ఉచితాల హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేంః సుప్రీం వెల్ల‌డి

ఎన్నిక‌లకు ముందు రాజ‌కీయ పార్టీలు ఓట‌ర్ల‌కు ఉచిత హామీలు ఇవ్వ‌కుండా నిరోధించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ ను సుప్రీం ధ‌ర్మాస‌నం విచారించింది.హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను తాము అడ్డుకోలేమని వెల్లడించింది.

 Can't Be Prevented From Giving Guarantees Of Freebies: Supreme Said , Cji, Guara-TeluguStop.com

ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని.ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ప్రధాన అంశమని పేర్కొంది.

జాతీయ ఉపాధి హామీ పథకం, ఉచిత తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలను ఉచితాలుగా వర్ణించలేమని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ స్ప‌ష్టం చేశారు.

ఉచిత వాగ్దానాల సమస్య జఠిలమవుతోందని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

ఈ నేప‌థ్యంలో అసలు ఉచిత హామీ, సంక్షేమ పథకం అని తేల్చేది ఎలా అంటూ ప్రశ్నించారు.ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, దీనిపై మరింత చర్చ జరగాలని తెలిపారు.

ఈ మేర‌కు ఆగస్టు 20 లోగా సూచనలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.అనంత‌రం తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube