గంటల వ్యవధిలో అపర కుబేరులను చేశాడు... ధోనీ అంటే మాములుగా ఉండదు..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ( Mahendra Singh Dhoni ) గురించి తెలియనవారు అసలు ఎవరూ ఉండరు.క్రికెట్ ను చూసే ప్రతిఒక్కరికీ, వార్తలను ఫాలో అయ్యే ప్రతిఒక్కరికీ ధోనీ గురించి తెలిసే ఉంటుంది.

 Candy Crush Game Trending Due To Ms Dhoni Details, Ms Dhoni, Viral News, Viral L-TeluguStop.com

ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ధోనీని అభిమానిస్తారు.ప్రతిఒక్క క్రికెట్ ప్రేక్షకుడు ధోనీని ఇష్టపడతాడు.

క్రికెట్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ధోనీని అందరూ అభిమానిస్తారు.ఎందుకంటే ధోనీ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడు.

అలాగే మైదానంలోనే కాకుండా బయట కూడా ఎంతో కూల్‌గా కనిపిస్తాడు.ఎంతటి టెన్షన్‌ను అయినా సరే బయటకు కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటాడు.

ధోనీలోని ఆ క్వాలిటీని అందరూ ఇష్టపడుతూ ఉంటారు.

అయితే ధోని స్ట్రైల్‌తో పాటు అతడు చేసే ప్రతి పనికి అభిమానులు ఫాలో అవుతూ ఉంటారు.అందుకు తాజాగా జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు.ఇండిగో ఎయిర్‌లైన్స్( Indigo Airlines ) ఫ్లైట్‌లో ధోనీ ప్రయాణిస్తూ క్యాండీ క్రష్ గేమ్( Candy Crush ) ఆడుతున్న వీడియో వైరల్ గా మారింది.

ధోనికి ఎయిర్ హోస్టన్ చాక్లెట్లు ఇస్తుండగా.తన ట్యాబ్‌లో ధోనీ క్యాండీ క్రష్ ఆడుతూ కనిపించాడు.ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ కావడంతో ధోనీ అభిమానులు కూడా క్యాండీ క్రష్ గేమ్‌ను తమ మొబైళ్లలో డౌన్‌లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు.దీంతో కేవలం 3 గంటల వ్యవధిలోనే 36 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఒక్కసారిగా ఇంతలా డౌన్‌లోడ్స్ పెరగడం చేసి క్యాండీ క్రష్ యాజమాన్యం ఆశ్చర్యపోయింది.దీంతో కారణం ఏంటని ఆరా తీయగా.ధోనీ వీడియో వల్లనే అని తెలిసింది.దీంతో ట్విట్టర్ వేదికగా ధోనీకి క్యాండీ క్రష్ యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది.తమ పాలిట దేవుడైన మహేంద్రసింగ్ ధోనీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది.కేవలం 3 గంటల్లోనే 3.6 మిలియిన్ల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం చూసి తామే షాక్ అయ్యామని, ఇందుకు గాను ఇండియన్ క్రికెట్ లెజెండ్ ధోనీకి థ్యాంక్స్ అంటూ ట్విట్టర్ లో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube