ఆ పెద్ద నోటు రద్దు ! అభ్యర్థులకు ఎన్ని కష్టాలు తెచ్చాయో 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి.ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న ఆయా పార్టీలు గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

 Cancel That 2000 Rupees Note How Many Hardships Did It Bring To The Candidates-TeluguStop.com

దీంతో ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలా అయినా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.ఎన్ని సొమ్ములైన ఖర్చు పెట్టేందుకు రెడీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

  ఇక ఎన్నికల ప్రచారం ఒక ఎత్తు అయితే,  పోలింగ్ తేదీ సమయానికి ముందు ఓటర్లకు నగదు పంపిణీ చేయడం అతిపెద్ద టాస్క గా మారింది.పోలీసులు,  ఎన్నికల( Election ) నిఘా అధికారుల నుంచి తప్పించుకుని ఓటర్లకు సొమ్ములు పంపిణీ చేయాల్సి ఉంటుంది.

Telugu Rupees, Brs, Congress, Candis, Telangana-Politics

 అంతకంటే ముందు ఎన్నికల ప్రచార ఖర్చులకు భారీగా సొమ్ములు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.  అయితే కొద్ది నెలల క్రితం 2000 నోటును రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం , 2000 నోటును తిరిగి బ్యాంకుల్లో జమ చేయాల్సిందిగా కోరింది.దానికి చివరి తేదీ ఎప్పుడో ముగిసింది.  ప్రస్తుతం పెద్ద నోటు అంటే 500 రూపాయలు నోటు చలమణిలో ఉంది.  దీంతో 500 నోట్లను తరలించడానికి అని పార్టీల అభ్యర్థులు నాన్న కష్టాలు పడుతున్నారట.  2000 నోటు( 2000 Rupees note ) అయితే సులభంగా ఎంతైనా తీసుకువెళ్లేందుకు అవకాశం ఉండేది.

  కానీ 500 నోట్ల కట్టలు తరలించడం ఇబ్బందికరంగా మారిందట.పోలీసులు,  కేంద్ర బృందాల విస్తృత తనిఖీలు నేపథ్యంలో , డబ్బులు ఒక చోట నుంచి మరొక చోటికి తరలించేందుకు చాలా ఇబ్బందులే ఎదుర్కొంటున్నారట.

Telugu Rupees, Brs, Congress, Candis, Telangana-Politics

పోలింగ్ తేది సమీపిస్తుండడంతో , చాలామంది అభ్యర్థులు ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యం నగదును సమకూర్చుకుంటున్నారు.ఎన్నికల ప్రచారం ఎంత విస్తృతంగా చేపట్టినా,  మద్యం నగదును పంపిణీ చేయడమే అది పెద్ద ఇబ్బందికర అంశంగా మారింది.గతంలో 2000 నోటు ఉన్న సమయంలో ఈ ఇబ్బంది పెద్దగా లేకపోయినా,  ఇప్పుడు మాత్రం ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.దీంతో డబ్బు పంపిణీ చేయడం,  ఎనకల్లో సొమ్ములు ఖర్చు పెట్టడం వంటివి అభ్యర్థులకు కొత్త కష్టాలు తీసుకొస్తున్నాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube