ఇటీవల నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లతో అడ్మిషన్లు సంపాదించిన 700 మంది భారతీయ విద్యార్ధులను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా( Canada ) ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం ఇరు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది.
భారత్, కెనడాలకు చెందిన రాజకీయ పార్టీలు విద్యార్థుల పక్షాన నిలబడ్డాయి.ఈ ప్రయత్నాలు ఫలించి విద్యార్ధుల బహిష్కరణ ప్రక్రియను కెనడా ప్రభుత్వం నిలిపివేసింది.
అంతేకాదు.భారతీయ విద్యార్ధులకు తాత్కాలిక అనుమతులను కూడా జారీ చేస్తామని తెలిపింది.
వీసా మోసంపై విచారణను ప్రారంభించి, దేశంలోనే వుండేందుకు అవకాశం కూడా కల్పిస్తోంది.

అయితే ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు చేస్తున్న మోసాలు ఒక్కొక్కొటిగా వెలుగుచూస్తుండటం, బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో కెనడా ప్రభుత్వం అప్రమత్తమైంది.ప్రస్తుతం అమల్లో వున్న ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌లోని లొసుగులను పూడ్చేందుకు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది.దీనిపై చండీగఢ్ ఏరియా డైరెక్టర్ (ఇమ్మిగ్రేషన్ , రెఫ్యూజీ అండ్ సిటిజన్‌షిప్ కెనడా) బ్రూస్ గ్రుండిసన్( Bruce Grundison ) మాట్లాడుతూ.
మోసపూరిత ఏజెంట్లపై విద్యార్ధులకు అవగాహన కల్పించడానికి, సరైన విద్యాసంస్థలను ఎంచుకోవడానికి త్వరలో పలు కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు.చండీగఢ్‌లోని( Chandigarh ) కెనడా కాన్సులేట్ జనరల్‌లో విద్యపై జరిగిన కార్యక్రమంలో గ్రుండిసన్ మాట్లాడుతూ.
నకిలీ అడ్మిషన్ లెటర్లు, విద్యార్ధుల బహిష్కరణపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

మైగ్రేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ నరేష్ శర్మ మాట్లాడుతూ.అధికారులతో ప్రత్యేక సంబంధాలు వున్నాయని స్టూడెంట్, వర్క్ వీసాలకు హామీ ఇప్పిస్తామంటూ ఏజెంట్లు చెప్పే మాయమాటలను నమ్మవద్దని సూచించారు.దీని వల్ల దాదాపు ఐదేళ్ల పాటు కెనడాలో ప్రవేశించకుండా నిషేధం సహా పలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందన్నారు.
చండీగఢ్‌లోని కెనడా కాన్సుల్ జనరల్ పాట్రిక్ హెబర్ట్ మాట్లాడుతూ.కెనడాకు వచ్చే ప్రతి ఐదవ వలసదారుడు భారత్‌కు చెందినవాడేనని తెలిపారు.ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం తమకు కీలక భాగస్వామిగా వుందన్నారు.







