కెనడియన్ హౌసింగ్‌పై విదేశీ యాజమాన్యంపై నిషేధాన్ని కెనడా ప్రభుత్వం( Canada Government ) రెండేళ్లు పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.దేశంలోని నగరాలు, పట్టణాలలో హౌసింగ్ మార్కెట్‌ల నుంచి కెనడియన్ల ధరలను తగ్గించడంతో పాటు హౌసింగ్‌లను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
కెనడా ప్రస్తుతం విపత్కర పరిస్ధితుల్లో హౌసింగ్ సంక్షోభాన్ని( Housing Crisis ) ఎదుర్కొంటోంది.వలసదారులు, అంతర్జాతీయ విద్యార్ధుల కారణంగానే ఈ పరిస్ధితి ఎదురైనట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.
పెరుగుతున్న ఖర్చులు నిర్మాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టగా.ఇళ్లకు డిమాండ్‌ను పెంచుతోంది.
కెనడియన్‌లకు గృహ నిర్మాణాన్ని అందుబాటులో వుంచడానికి సాధ్యమయ్యే అన్ని సాధనాలను ఉపయోగించడంలో భాగంగా కెనడియన్ హౌసింగ్‌పై విదేశీ యాజమాన్యంపై( Foreign Ownership ) నిషేధం గడువు జనవరి 1, 2025 వరకు వుంది.దీనిని జనవరి 1, 2027 వరకు పొడిగిస్తున్నట్లుగా కెనడియన్ ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్( Chrystia Freeland ) ఒక ప్రకటనలో తెలిపారు.
గత నెలలో కెనడా అంతర్జాతీయ విద్యార్ధుల అనుమతులపై తక్షణ, రెండేళ్ల పరిమితిని ప్రకటించిన సంగతి తెలిసిందే.

గృహ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్న అంశాలను అదుపు చేసేందుకు కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇమ్మిగ్రేషన్( Immigration ) ద్వారా వేగవంతమైన జనాభా పెరుగుదల , ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి సేవలపై ఒత్తిడి తెచ్చింది.ఈ పరిణామాలు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) ప్రజామోదంపై ప్రభావం చూపుతోంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో ఓడిపోతాడని పలు సర్వేలు చెబుతున్నాయి.

అధికారిక గణాంకాల ప్రకారం.కెనడాలో అంతర్జాతీయ విద్యార్ధుల సంఖ్య మిలియన్ మార్క్ దాటింది.ఈ క్రమంలోనే ట్రూడో ప్రభుత్వం వారి రాకను పరిమితం చేస్తోంది.2022లో కెనడాలో 8,00,000కు పైగా అంతర్జాతీయ విద్యార్ధులు వుండగా 2023లో ఈ సంఖ్య 9,00,000కు పైగా వుండొచ్చని ఫెడరల్ ప్రభుత్వం అంచనా వేసింది.హౌసింగ్ సంక్షోభం , వలసదారులు, అంతర్జాతీయ విద్యార్ధుల పెరుగుదల నేపథ్యంలో విదేశీ విద్యార్ధుల ఎంట్రీకి అనుగుణంగా ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధను పరిష్కరించాల్సిన అవసరం వుందని బ్రౌన్ పేర్కొన్నారు.







