భారతీయులకు తప్పని నిరీక్షణ.. విమాన రాకపోకలపై నిషేధాన్ని పొడిగించిన కెనడా

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మనదేశం నుంచి వచ్చే విమానాలు, ప్రయాణికులపై ఆయా దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్‌తో మొదలైన ఈ ట్రావెల్ బ్యాన్ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.

అయితే మనదేశంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఒక్కొక్క దేశం నిషేధాన్ని ఎత్తివేస్తూ వస్తున్నాయి.అమెరికా, బ్రిటన్, యూఏఈలు నిషేధాన్ని ఎత్తివేసిన జాబితాలో వున్నాయి.

దీంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇక అమెరికా, బ్రిటన్‌ తర్వాత భారతీయులు పెద్ద సంఖ్యలో వలస వెళ్లే కెనడా మాత్రం విమానాలపై బ్యాన్ ఇంకా కొనసాగిస్తూనే వుంది.

తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారని ఎదురుచూస్తున్న వారికి కెనడా ప్రభుత్వం షాకిచ్చింది.భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై సెప్టెంబర్ 21 వరకు నిషేధం కొనసాగుతుందని తాజాగా ప్రకటించింది.

Advertisement

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 22న తొలిసారి భారత విమానాలపై కెనడా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత బ్యాన్‌ను పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది.

తాజాగా ఐదోసారి నిషేధాన్ని పొడిగించింది.సెప్టెంబర్ 21, రాత్రి 11.59 గంటల వరకు భారత్ నుంచి వచ్చే అన్ని కమర్షియల్, ప్రైవేట్ ప్యాసెంజర్ విమానాలపై బ్యాన్ కొనసాగుతుందని కెనడా ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది.అయితే, కార్గో, ఇతర అత్యావసర విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.

కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదని, పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెనడా వెల్లడించింది.

ఆంక్షలు విధించినప్పటికీ కెనడా.భారతీయులకు చిన్న వెసులుబాటు కల్పించింది.అదేంటంటే.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

థర్డ్‌ కంట్రీ’ ద్వారా భారత్‌ నుంచి ప్రయాణికులు కెనడా రావొచ్చని తెలిపింది.ఇందుకోసం ప్రయాణికులు మరో దేశంలో దిగి అక్కడ కరోనా టెస్టులు చేయించుకోవాలి.

Advertisement

అనంతరం అక్కడే రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి.ఆ తర్వాత కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌తో కెనడాకు రావొచ్చని వెల్లడించింది.

అయితే విమానాలపై నిషేధం రద్దు చేయాల్సిందిగా భారత ప్రభుత్వం ఇటీవల కెనడా ప్రభుత్వాన్ని కోరింది.ఈ మేరకు ఒట్టావాలోని భారత హైకమీషన్.

ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఓ లేఖ పంపిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు