మెట్రో రైలు టికెట్లను ఇక వాట్సాప్‌లోనూ పొందొచ్చిలా?

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.మీ మీ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయనే విషయం అందరికీ తెలిసినదే.

 Can You Get Metro Train Tickets On Whatsapp  Metro, Train, Tickets, Whatsapp, Ch-TeluguStop.com

అయితే మెట్రోలో ఫాస్ట్ గా గమ్యస్థానానికి తొందరగా వెళదాము అనుకుంటున్న నగర వాసులకు టికెట్ తీసుకోవడానికి కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి.దీనికీ ఓ సూపర్ పరిష్కారం కనిపెట్టింది హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ.

మరెందుకాలస్యం, వివరాల్లోకి వెళ్ళిపోదాం రండి.

మెట్రోరైల్‌ ప్రయాణికులు ఇకపై గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన అవసరం లేదు.

మీ మొబైల్ లోనే టికెట్ పొందొచ్చు.అవును, వాట్సాప్‌ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని అధికారులు తాజాగా తెలిపారు.

వాట్సాప్‌ ద్వారా డిజిటల్‌ పద్ధతిలో నగదు బదిలీ చేయవచ్చని, దేశంలోనే తొలిసారిగా తాము ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.ఇందుకోసం బిల్‌ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు.

మెట్రోస్టేషన్ల వద్ద ఉన్న క్యూర్‌ కోడ్‌ను వాట్సాప్‌ ద్వారా స్కాన్‌ చేసి కూడా టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చని అధికారులు తెలిపారు.మెట్రోలో వాట్సాప్ ద్వారా టికెట్ కొనుగోలు ఎలా చేయాలంటే.

Telugu Chat, Hyderabad, Metro, Tech, Ups, Tickets, Train, Whatsapp-Latest News -

1.ముందుగా మీ నంబర్‌తో వాట్సాప్ ద్వారా 8341146468కు హాయ్‌ అని టైపు చేయండి.

2.తరువాత మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేయాలి.

3.ఆ తరువాత గమ్యస్థానాన్ని నమోదు చేయాలి.

4.ఇపుడు టిక్కెట్‌ ధరను బదిలీ చేయాలి.

5.తద్వారా మీకు ఇపుడు ఈ-టికెట్‌ వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube