100 ఐఫోన్స్ ఫ్రీ గా ఇస్తా అంటున్న 'నా అన్వేషణ' యూట్యూబర్‌.. నమ్మొచ్చు అంటారా..?!

ఈ మధ్యకాలంలో తెలుగులో మోస్ట్ ట్రెండింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది యూట్యూబర్ అన్వేష్ ( YouTuber Anvesh ) అని చెప్పవచ్చు.ఈ మధ్యకాలంలో యూట్యూబర్ అన్వేష్ అలాగే మరో యూట్యూబర్ బన్నీ యాదవ్ మధ్య జరిగిన కొన్ని సంఘటనల ద్వారా మరింతగా పాపులర్ అయ్యాడు.

 Can You Believe The Youtuber Who Claims To Give Away 100 Iphones For Free, Viral-TeluguStop.com

ఇకపోతే యూట్యూబర్ అన్వేష్ విషయానికి వస్తే.ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న 160 దేశాలను తిరిగి అక్కడ పరిస్థితులను తెలుసుకొని అందిరికి చూపించాడు.ఈయనకు సోషల్ మీడియాలో భాగంగా ఇంస్టాగ్రామ్ లో 1.4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.అలాగే యూట్యూబ్ లో 20 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు.ప్రతినెల ఈయన వీడియోలకి దాదాపు మూడు కోట్ల న్యూస్ వస్తున్నాయాంటే అతని ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈయన ఏ ఫోటో పెట్టిన, వీడియో పెట్టిన కాస్త వైరల్ గా మారడానికి కారణం అతడు మాట్లాడే భాష యాస.అతడు మాట్లాడడం కాస్త డిఫరెంట్ గా ఉండడంతో తనకి మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది.ఇతడు సోషల్ మీడియా వేదికగా బాగానే డబ్బులు సంపాదిస్తున్నాడు.

చాలామంది సోషల్ మీడియాలో భాగంగా అధిక మొత్తం సంపాదిస్తున్నారు.అయితే ఈ యూట్యూబర్ మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా కేవలం కంటెంట్ మీద ఆధారపడి వీడియోలు చేస్తూ పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు.కాకపోతే ప్రస్తుతం అన్వేష్ చేసిన అనౌన్స్మెంట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

నిజానికి అది ఆషామాషా ఆఫర్ కాదండోయ్.తన ఫాలోవర్స్ లో ఉన్న వారికి ఏకంగా 100 ఐఫోన్ ( 100 iPhone )లను గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు ప్రకటన చేశాడు.

అది కూడా లేటెస్ట్ వర్షన్ ఐఫోన్ 15( iPhone 15 ).ఇకపోతే అసలు ఎందుకు ఈ ప్రకటన చేశాడన్న నేపథ్యంలో.

భారతదేశంలో లాంచ్ అవ్వబోయే ఓ సెల్ఫోన్ కంపెనీ వారు ఆయన పేరుపై ప్రమోషన్ చేస్తామని కోరగా.అందుకుగాను అతడికి డబ్బులు ఇస్తామని తెలిపారు.కాకపోతే తాను ఎలాంటి ప్రమోషన్స్ చేయనని సింపుల్ గా రిజెక్ట్ చేశారు.కాకపోతే డబ్బులు ఇవ్వకుండా ఆయనకీ 100 ఐఫోన్లను గిఫ్ట్ గా ఇస్తానని చెప్పడంతో అందుకు అన్వేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

దాంతో తనకు రాబోతున్న వంద ఈ ఫోన్లను కూడా తన ఫాలోవర్స్ కు ఫ్రీగా ఇస్తానని అన్వేష్ మాట ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం పాపులర్ గా మారింది.

ఎవరికైతే ఐఫోన్ కావాలో వారు ఆ వీడియో కింద కామెంట్ చేయాలని అన్వేష్ కోరగా.ఏకంగా ఆ వీడియోకు 1 మిలియన్ కామెంట్లు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇకపోతే కామెంట్స్ లో సెలబ్రిటీలు కూడా ఉండడం ఒకింత ఆశర్యమే.చూడాలి మరి అన్వేష్ చెప్పినట్టుగా తన ఫాలోవర్స్ కు 100 ఐఫోన్లు ఏ మాత్రం ఇస్తాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube