గుడ్డు మరియు మాంసాహార పదార్ధాలను తిని గుడికి వెళ్లవచ్చా?   Can We Visit Temple After Eating Non Veg?     2017-07-05   22:23:42  IST  Raghu V

గుడ్డు మరియు మాంసాహార పదార్ధాలలో తమో,రజో గుణాలకు సంబందించిన పదార్ధాలు. తమో,రజో గుణాలంటే కోపం,కామం, కలిగి ఉండటం. ఈ గుణాలు ఉండుట వలన సత్వ గుణం తగ్గిపోతుంది. దేవాలయం మరియు దైవారాధన చేసే సమయంలో సత్వ గుణం కలిగి ఉండటం ముఖ్యం. తమో,రజో గుణాల కారణంగా మనో నిగ్రహం కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో దైవ కార్యాలు సఫలం కావు. అందువల్ల తమో,రజో గుణాలను కలిగించే ఆహారాలను తీసుకోకూడదు.

పాలు,పండ్లు,కూరగాయల వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మరొక వవిషయం ఏమిటంటే గుడ్డు మరియు మాంసాహారంలోనే కాకుండా ఉల్లి,వెల్లుల్లి, మసాలా దినుసులతో కూడా తమో,రజో గుణాలు ఉంటాయి. అందువల్ల గుడికి వెళ్లే సమయంలోను మరియు దైవ కార్యాలు చేసే సమయంలోను తమో,రజో గుణాలు ఉన్న ఆహారాలను తీసుకోకూడదు.