Coconut Water : షుగర్ వ్యాధి ఉన్నవారు కొబ్బరినీరు త్రాగవచ్చా..నిపుణులు చెప్పే సలహా ఇదే..!

షుగర్, మధుమేహం( Diabetes ), చక్కర వ్యాధి ఇలా ఏ పేరుతో అయినా ఈ మహమ్మారిని పిలుస్తుంటారు.

ఇందులో టైప్ 1, టైప్ 2 అనే రకాలు కూడా ఉన్నాయి.

జన్మపరమైన కారణాలతో పాటు మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్లు మానసిక ఒత్తిడితో షుగర్ బాధితులు పెరిగిపోతున్నారు.ప్రస్తుతం ఇది సాధారణంగా మారిపోయింది.

అయితే షుగర్ ఉన్న వారు ఆహారం విషయంలో చాలా నియంత్రణ పాటించాల్సి ఉంటుంది.షుగర్ పెరిగితే దాని ప్రభావం ఇతర అవయవాల పై కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అందుకే వ్యాధి నిర్ధారణ అయిన వారు డైట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో చాలా మంది ప్రజలు కొబ్బరి నీరు తీసుకుంటూ ఉంటారు.కొబ్బరి నీరు( Coconut water ) శరీరానికి చలువ చేయడంతో పాటు శక్తిని కూడా ఇస్తాయి.ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి నీరు ఎంతో అవసరం.

అయితే సహజసిద్ధమైన కొబ్బరి నీళ్లు తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి నొప్పి దూరమవుతుంది.

గర్భిణీలు కొబ్బరి నీళ్లు తాగితే తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఎంతో మంచిది.ఇక కొబ్బరి నీళ్లలో కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి.

ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి.గ్లాసు కొబ్బరి నీళ్లలో తొమ్మిది శాతం ఫైబర్ ఉంటుంది.

నేడు ఏపీ లో ప్రధాని మోదీ ఎన్నికల టూర్ .. షెడ్యూల్ ఇదే
మహేష్ బాబు సినిమాను తక్కువ అంచనా వేసిన స్టార్ ప్రొడ్యూసర్...

కడుపులో మంటగా అనిపిస్తే గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే ఉపశమనం కలుగుతుంది.

Advertisement

అలాగే జీర్ణ వ్యవస్థ( Digestive system ) కూడా మెరుగుపడుతుంది.తరచూ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.కొబ్బరి నీళ్లలో చెక్కర శాతం కూడా తక్కువగా ఉంటుంది.

షుగర్ ఉన్న వారు కూడా కొబ్బరి నీళ్లు తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.అయితే మాత్రం కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.

ముదిరిన కొబ్బరికాయ లేదా కొబ్బరి పట్టిన కాయలోని నీళ్లు తాగకూడదు.లేత కొబ్బరి నీళ్లు తాగితే షుగర్ ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అందుకే లేత కొబ్బరికాయ నీళ్లు తాగడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు